ఎక్కడైనా 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాళ్లను ఆజానుబాహులు అంటారు. మరి ఏడుగు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంటే ఏమనాలి. అసలు అంత ఎత్తు ఉన్న వాళ్లు మన దేశంలోనే ఉన్నారంటే నమ్ముతారా. ఉండటం విచిత్రం కాదు..అతనికి సరిపోయే డ్రెస్‌లు, చెప్పులు, చివరకు పడుకునే మంచం సైజు కూడా మార్కెట్‌లో దొరకడం లేదట. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని హమీర్‌పూర్ జిల్లాలోని ఖలీని పోలిన యువకుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. 18సంవత్సరాల వయసున్న సిరాజ్(Siraj)ఎత్తు 7.2అడుగులు(7.2 Feet). అతని బరువు 115కిలోలు. ఇంత ఎత్తు పెరిగిన యువకుడికి ఇప్పుడు తన హైటే పెద్ద సమస్యగా మారింది.
7.2అడుగుల ఆజానుభాహుడు..
దేశంలో మరో ఎత్తైన యువకుడు ఇప్పుడు అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలోని ఇచౌలీ అనే చిన్న గ్రామంలో ఉన్నాడు. పేరు సిరాజ్. ఇప్పుడు మాత్రం జూనియర్ ఖలీ అని పిలుస్తున్నారు. ఎందుకంటే 18సంవత్సరాల వయసున్న ఈ యువకుడు ఎత్తు 7.2అడుగులు. అంటే పంజాబ్‌కి చెందిన రెజ్లర్ గ్రేట్ ఖలీ(దలీప్‌సింగ్ రాణా) హైట్ కంటే కూడా ఒక ఇంచు ఎక్కువేనన్న మాట. గ్రామానికి చెందిన సిపాహిలాల్ అనే సామాన్య రైతుకు 2004లో జన్మించాడు ఈ టాల్ మెన్.
హైట్‌తో ప్రాబ్లమ్..
పుట్టినప్పుడు బాగానే ఉన్న సిరాజ్ .. 2009లో 5.2అడుగుల ఎత్తు తర్వాత ఒక్కసారిగా బరువుతో పాటు హైట్ పెరగడం గమనించింది తల్లి. 14సంత్సరాల తర్వాత అతనిలో ఆకలి పెరగడంతో రోజు రెండు లీటర్ల పాలతో పాటు 20చపాతీలు, అరకిలో అన్నం తింటున్నాడు. పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఈ యువకుడు అందుకోసం శరీర ధారుడ్యాన్ని పెంచుకున్నాడు. రోజూ 10కిలో మీటర్లు రన్నింగ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడొచ్చిన సమస్య ఒక్కటే. ఇంత ఎత్తు ఎదిగిన సిరాజ్‌కు వేసుకునే దుస్తుల నుంచి చెప్పులు, చివరకు పడుకునే మంచం కూడా సరిపోవడం లేదు. అందుకే వాటిని ప్రత్యేకించి తయారు చేయించుకోవాల్సి వచ్చింది.
ఉద్యోగం కోసం పాట్లు..
కేవలం విజిటేరియన్ మాత్రమే తినే సిరాజ్ 2019లో హైస్కూల్ స్టడీ పూర్తి చేసి పట్టభద్రుడయ్యాడు. పరీక్ష రాసి సైన్యంలోకి వెళ్లి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాడు. మరీ ది గ్రేట్ ఖలీలా సిరాజ్ కూడా పోలీస్ శాఖలో ఉద్యోగం పొందుతాడని తల్లిదండ్రులు ఆశ పడుతున్నారు. అయితే అతని ఎత్తు చూస్తే మాత్రం గ్రామానికి చెందిన ఎంత పొడవైన వాళ్లైనా పొట్టిగానే కనిపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, VIRAL NEWS, Viral Video