SERIAL NUMBERS WRITTEN ON SAMOSAS IN A HOTEL IN DELHI AFTER THAT SHOCKED CUSTOMER PRV
Serial numbers on Samosa: సమోసాలపై సీరియల్ నంబర్లు వేసిన ఢిల్లీలోని హోటల్.. అవాక్కయిన కస్టమర్..
సమోసాలపై సీరియల్ నంబర్ (ఫొటో: ట్విటర్)
ఓ హోటల్ యాజమాన్యం మాత్రం వారు వడ్డించే ఐటెమ్ల మీద ఏకంగా సీరియల్ నంబర్లే(serial numbers) వేస్తున్నారు. ఢిల్లీలోని ఆ హోటల్లో సమోసాల(Samosa)పై కూడా సీరియల్ నంబర్లు దర్శనమివ్వడం చూపరులను ఆకట్టుకుంటోంది.
తినే ప్రతి గింజ మీద ఆ వ్యక్తి పేరు రాసి పెట్టి ఉంటుందంటారు పెద్దలు. అలా అని గింజపై పేరు ఏం కనిపించదు కదా.. కానీ, ఓ హోటల్(Hotel) యాజమాన్యం మాత్రం వారు వడ్డించే ఐటెమ్ల మీద ఏకంగా సీరియల్ నంబర్లే(serial numbers) వేస్తున్నారు. ఢిల్లీలోని ఆ హోటల్లో సమోసాల(Samosa)పై కూడా సీరియల్ నంబర్లు దర్శనమివ్వడం చూపరులను ఆకట్టుకుంటోంది. అక్కడికి వెళ్లి ఓ వ్యక్తికి తను ఆర్డర్ చేసిన సమోసాలపై నంబర్లు(numbers) వేసి ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే సోషల్ మీడియాలో ఫొటో తీసి షేర్ చేశాడు. ఇంకేటి ఆ ఫొటో ప్రస్తుతం ట్విటర్(twitter)లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సమోసాలపై నంబర్ల ఏదో అలా వచ్చేశాయా.. మరేదైనా కారణమా .. ఆ సమోసా కథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం..
టెక్ ప్లీజ్..... డిస్టేన్స్..
ఢిల్లీకి చెందిన నితిన్ మిశ్రా (Nithin Mishra) అనే వ్యక్తి ఓ దుకాణంలో రెండు సమోసాలకు ఆర్డరిచ్చాడు. దీంతో అతని ఇంటికి సమోసాలు సరఫరా అయ్యాయి. అయితే, వాటిపై క్రమ సంఖ్య ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఫొటోతో సహా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ‘నేను ఆర్డర్ చేసిన సమోసాలపై సీరియల్ నంబర్లు ఉన్నాయి. టెక్ ప్లీజ్.. నా హల్వాయికి దూరంగా ఉండవా’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. మరోవైపు సమోసాలకు క్రమ సంఖ్య ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియా(social media)లో వైరల్ అయ్యింది.
క్యూ ఆర్ కోడ్ వచ్చేస్తుందేమో..
నెటిజన్లు(netizens) దీనిపై పలు కామెంట్లు చేశారు. సమోసాలకు నంబర్ల విధానం కొనసాగడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, అవి ప్రముఖ ఈటరీ ‘సమోసా పార్టీ’కి చెందినవి అంటూ ఒకరు బదులిచ్చారు. ఆ ఈటరీ సమోసాలకు సీరియల్ నంబర్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. సిబ్బంది తినకుండా ఉండేందుకే సమోసాలకు నంబర్లు వేసి ఉంటారని ఒకరు జోక్ వేశారు. బార్కోడ్, క్యూఆర్ కోడ్ వంటివి కూడా త్వరలో సమోసాలపై కనిపించవచ్చని మరొకరు చమత్కరించారు.
Samosas I ordered had serial numbers 🙄 Can tech pls stay away from my halwai. pic.twitter.com/DKo1duIiC9
అయితే ఇలాంటి వినూత్న హోటల్స్ చాలానే ఉన్నాయి. ఒరిస్సాలో ఓ హోటల్లో ఆతిథ్యం మరీ కొత్తగా ఉంటుందట. కుర్చీలు అన్నీ ఉన్నా కూడా కిందనే కూర్చోబెడుతారంట. ఇక లాట్వియా దేశంలో మరో వింత హోటల్ ఉంటుంది. నేరం చేయకుండా జైలుకెళ్లాలంటే లాట్వియా దేశంలోని కరోస్టా ప్రిజన్ హోటలను సందర్శించాల్సిందే. ఎందుకంటే ఆ హోటల్ ఒకప్పుడు జైలు. లాట్వియా నుంచి పారిపోయేందుకు యత్నించిన వారిని సోవియట్ సైన్యం ఈ జైలులో బంధించేదట. ఆ జైలునే ప్రస్తుత యాజమాన్యం హోటల్ గా మార్చేసి.. పర్యాటకులకు జైలు అనుభవాన్ని కల్పిస్తోంది. ఇక్కడి సిబ్బంది పోలీసు దుస్తుల్లో కనిపిస్తుంటారు. పర్యాటకులు ఇక్కడికి వస్తే ఖైదీల దుస్తులు వేసుకొని, జైలు గదుల్లో నేలపై నిద్రపోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.