జడ్జి ఎదుటే పొగతాగిన సీనియర్ న్యాయవాది...వైరల్ వీడియో

రాజస్థాన్ హైకోర్టులో వర్చువల్ విచారణ సమయంలో న్యాయవాది పొగతాగుతుండటాన్ని న్యాయమూర్తి గమనించారో? లేదో? తెలియడం లేదు.

news18-telugu
Updated: August 13, 2020, 10:09 PM IST
జడ్జి ఎదుటే పొగతాగిన సీనియర్ న్యాయవాది...వైరల్ వీడియో
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో కోర్టు విచారణలు వర్చువల్‌గా జరుగుతుండడం తెలిసిందే. రాజస్థాన్ హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో సీనియర్ న్యాయవాది పొగతాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తున్న పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్చువల్ విచారణ సమయంలో జడ్జి ఎదటే సీనియర్ న్యాయవాది రాజీవ్ థావన్ కెమరాకు పేపర్ అడ్డుగా పెట్టుకుని పొగతాగుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వర్చువల్ విచారణలో కాంగ్రెస్ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా పాల్గన్నారు. వర్చువల్ విచారణలో న్యాయవాది పొగతాగుతుండటాన్ని న్యాయమూర్తి గమనించారో? లేదో? తెలియడం లేదు.



ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి...సీనియర్ న్యాయవాది రాజీవ్ థావన్‌పై ఎలా స్పందించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
Published by: Janardhan V
First published: August 13, 2020, 10:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading