ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బరేలీ(Bareilly)లో ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేరే మతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి ఆర్యసమాజ్‌లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. అయితే యువతి కుటుంబ సభ్యులతో పాటు వారి మతస్తులకు నచ్చకపోవడంతో వేరే ముస్లిం యువకుడితో వివాహం జరిపించాలని ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా తన భార్యకు చేస్తున్న బలవంతపు వివాహాన్ని ఆపాలని ...తన భార్యను తనకు అప్పగించమని వేడుకుంటూ సెల్ఫీ వీడియో(Selfie video)ను సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో వార్త వైరల్ అవుతోంది.
మతాంతర వివాహానికి పెద్దలు బ్రేక్..
ఉత్తరప్రదేశ్‌లో నిఖత్ అనే ముస్లిం యువతి నైరా సింగ్ అనే హిందూ యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరికి అంగీకారం కావడంతో గతేడాది జనవరిలో ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అయితే మతాంతర వివాహం చేసుకున్న నిఖత్ని కుటుంబ సభ్యులు బలవంతంగా ఆమెను భర్త నుంచి తీసుకెళ్లారు. అంతే కాదు ఆమెకు ముస్లిం యువకుడితో వివాహం చేయాలని నిశ్చయించారు. ఈవిషయాన్ని నిఖత్ నైరా సింగ్‌కు మెసేజ్ పెట్టడంతో బాధితుడు ధానా ఫరీద్పూర్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ముస్లిం యువతిని ఎత్తుకెళ్లిన పేరెంట్స్..
దీంతో బాధితుడు నైరా సింగ్ తన భార్యకు కుటుంబ సభ్యులు చేస్తున్న బలవంతపు పెళ్లిని అడ్డుకోవాలని కోరుతూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. అందులో నిఖత్ తాను తల్లిదండ్రుల దగ్గర ఉండలేనని ..తనను ఎలాగైనా తీసుకెళ్లమని కోరుతూ పెట్టిన మెసేజ్‌ని చూపిస్తూ తన బాధ పోలీసులకు చెప్పుకుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని సీఎం యోగీ ఆధిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్దమాని ప్రయత్నిస్తే కుదరలేదని కన్నీరు పెట్టుకున్నాడు నైరా సింగ్.
వేరే పెళ్లి చేయాలని ప్లాన్..
అంతే కాదు ప్రేమ పెళ్లి చేసుకున్న తమను పెద్దలు మతం పేరుతో విడదీయాలని చూస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈవిషయంలో తన భార్య నిఖత్‌కి ఏమైనా జరిగితే తాను బ్రతకలేనంటూ ఏడుస్తూ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎలాగైనా తన భార్యకు పెద్దలు చేస్తున్న ఇష్టం లేని పెళ్లిని ఆపి ఆమెకు వాళ్ల చెర నుంచి విడిపించి తన చెంతకు చేర్చాలని ప్రాధేయపడుతున్నాడు. అంతే కాదు ఒకవేళ నిఖత్‌తో తనతో కలిసి జీవించడం ఇష్టం లేకపోతే తన ముందుకు వచ్చి చెబితే తాను జన్మలో ఆమెను కలవనంటున్నాడు. తల్లిదండ్రులు భయపెట్టే ఆమెతో ఇలాంటి మెసేజ్‌లు పంపారని చెప్పడంతో పోలీసులు విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Viral Video