Video : వెండింగ్ మెషిన్‌లో చిక్కుకున్న 'రక్కూన్'... ఎలా రక్షించారంటే...

ఫ్లోరిడాలోని ఆ హైస్కూల్ దగ్గరున్న వెండింగ్ మెషిన్‌లో రక్కూన్ ఉండటంతో... అలర్టైన విద్యార్థులు... పోలీసులకు కాల్ చేశారు. అటవీ అధికారులు వచ్చి దాన్ని కాపాడారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 16, 2019, 10:48 AM IST
Video : వెండింగ్ మెషిన్‌లో చిక్కుకున్న 'రక్కూన్'... ఎలా రక్షించారంటే...
వెండింగ్ మెషిన్‌లో రక్కూన్ (Image : FB - Volusia County Sheriff's Office)
Krishna Kumar N | news18-telugu
Updated: August 16, 2019, 10:48 AM IST
ఫ్లోరిడాలోని... పిన్ రిడ్జ్ హైస్కూల్ దగ్గర ఖాళీ ప్రదేశంలో ఉంది ఆ వెండింగ్ మెషిన్. అందులో కూల్ డ్రింకులు, స్నాక్స్ వంటివి చాలా ఉన్నాయి. వాటిని చూసి, ఎలాగైనా వాటిని తినాలనుకున్న రక్కూన్ (రాచ ఉడుత, నక్క పోలికలతో ఉండే చిన్న జంతువు)... ఎలా దూరిందో గానీ... వెండింగ్ మెషిన్‌లో దూరింది. తీరా లోపలికి వెళ్లాక అక్కడ ఇరుక్కుపోయింది. "చచ్చాన్రా దేవుడా... ఇలా బుక్కైపోయానేంటీ... వాళ్ల చేతికి చిక్కితే... కైమా చేసేస్తారే" అని తెగ కంగారు పడిపోయింది. వెండింగ్ మెషిన్ దానంతట అదే అటూ ఇటూ ఊగుతుండటం చూసిన విద్యార్థులు "ఏంటది... ఎందుకలా ఊగుతోంది" అని దగ్గరకు వెళ్లి చూశారు. లోపల అటూ ఇటూ కదిలేందుకు ప్రయత్నిస్తూ... రక్కూన్ కనిపించింది. మొదట కంగారు పడ్డారు. తర్వాత... పకపకా నవ్వుకున్నారు. స్కూల్ టీచర్లు... పోలీసులకు కాల్ చేశారు. వాళ్లు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అలా... అధికారులు వచ్చి... వెండింగ్ మెషిన్ ఇలా ఓపెన్ చేశారో లేదో... అలా చటుక్కున తప్పించుకొని... "బతికాన్రా దేవుడో" అనుకుంటూ పారిపోయింది రక్కూన్.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ఈ వీడియోని చూసి... తెగ నవ్వుకుంటున్నారు. తమ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...