Security guard to software employee: పదో తరగతి కుర్రాడు.. సిటీలో సెక్యూరిటీ గార్డుగా జాబ్.. ఎనిమిది నెలల్లోనే సీన్ రివర్స్..సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కొత్త లైఫ్

అబ్ధుల్ అలీమ్ (Image Credit: Srig Laks Facebook)

ఆ కుర్రాడు చదివింది కేవలం పదో తరగతే. ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు బాగాలేక చదువు ఆపేశాడు. సిటీకి వెళ్లి ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా జీవితాన్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాతే అతడి లైఫ్ ఊహించని మలుపు తిరిగింది.

  • Share this:
పట్టుదల, కృషి, నేర్చుకోవాలన్న తపన ఉంటే చాలు ఎంతటి విజయాన్నైనా సాధించగలం. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయేది కూడా అటువంటి ఒక సాధారణ యువకుడి విజయగాథే. పట్టుదలతో ఓవైపు చదువుకుంటూనే నైపుణ్యాలను నేర్చుకొని జీవితంలో విజయం సాధించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. అస్సాంలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన అబ్ధుల్ అలీమ్​ అనే యువకుడు​.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక 10వ తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. కుటుంబ దీనస్థితిని చూడలేక, కేవలం రూ.1000లతో 2013లో ఉద్యోగ వేట కోసం చెన్నై బయలుదేరాడు. రెండు నెలల పాటు ఎన్నో కష్టాలు పడుతూ చెన్నైలోనే ఉద్యోగ వేట కొనసాగించాడు. అయినా ఫలితం లభించలేదు.

చివరగా చెన్నైలోని జోహో కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం దొరికింది. అక్కడ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్న క్రమంలో.. ఒకరోజు తన సీనియర్ ఉద్యోగి అలీమ్​ను తన చదువు, కంప్యూటర్ల పరిజ్ఞానం గురించి కొన్ని ప్రశ్నలు అడగ్గా.. తాను పదో తరగతి వరకే చదివానని, స్కూల్​లో HTML బేసిక్స్​ నేర్చుకున్నానని అలీమ్ ​సమాధానమిచ్చాడు. మరి ఇప్పుడు నేర్చుకుంటావా? అని ఆ సీనియర్​ ఉద్యోగి అడగ్గా.. అవకాశం ఉండాలే కానీ తప్పకుండా నేర్చుకుంటానని చెప్పాడు. అయితే, నీకు నేను అన్ని విధాలుగా శిక్షణ, సహకారం అందిస్తానని ఆ ఉద్యోగి మాటిచ్చాడు. అప్పటి నుంచి అబ్దుల్​ అలీమ్​ జీవితం కొత్త మలుపు తీసుకుంది.
ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్

సెక్యూరిటీ గార్డుగా అతడు రోజూ 12 గంటలు పనిచేస్తూనే ఆ సీనియర్​ ఉద్యోగి వద్దకు వెళ్లి సాఫ్ట్​వేర్​ టూల్స్​, కోడింగ్​ నేర్చుకునేవాడు. ఇలా ఎనిమిది నెలల పాటు అభ్యాసం చేసిన తర్వాత తనే స్వయంగా ఒక యాప్​ను రూపొందించాడు. అలీమ్​ డెవలప్​ చేసిన యాప్​ను ఆ సీనియర్ ఉద్యోగి తన మేనేజర్‌కు చూపించగా.. అలీమ్​ ప్రతిభను మెచ్చుకున్నాడు. అతడికి డిగ్రీ లేకపోయినా సరే, టాలెంట్​ను పరిగణలోకి తీసుకొని ఇంటర్వ్యూ కండెక్ట్​ చేశారు. ఈ ఇంటర్వూలో నెగ్గి అలీమ్​ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా ఎంపికయ్యాడు.

మాకు డిగ్రీలు కాదు.. టాలెంట్​ ఉన్నవారే కావాలి..
సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా ఎంపికవ్వడంపై అలీమ్​ మాట్లాడుతూ.. "నేను నా జీవితంలో ఎప్పుడూ కాలేజీకి వెళ్ళలేదు. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. కాబట్టి, ఇలా ఓ పెద్ద సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీ డిగ్రీలు కాదు, నైపుణ్యాలు మాత్రమే ముఖ్యమని జోహో సంస్థ నిరూపించింది. దానికి చక్కటి ఉదాహరణ నేనే. ఎట్టకేలకు, నా ఇంటర్వ్యూను క్లియర్ చేసి జోహో కార్పొరేషన్‌లోని సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా ఉద్యోగం సాధించాను. నాకు సరైన విద్యార్హతలు లేకపోయినా, నా టాలెంట్​ను మెచ్చి ఉద్యోగంలోకి తీసుకన్న జోహో యాజమాన్యానికి కృతజ్ఞతలు. అలాగే, ఒక సాధారణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నాకు శిక్షణనిచ్చి ప్రోత్సహించిన నా సీనియర్ ఉద్యోగి షిబు అలెక్సిస్​కు ఎంతగానో రుణపడి ఉంటాను. ప్రస్తుతం, నా ఉద్యోగంలో 8 ఏళ్లు పూర్తిచేసుకున్నాను." అంటూ తన లింక్డ్​ఇన్​ పోస్ట్​లో​ పేర్కొన్నాడు. కాగా, జోహో సాఫ్ట్​వేర్​ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డెవలప్​మెంట్​ విభాగాల్లో సేవలు అందిస్తుంది.
ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
First published: