Home /News /trending /

KFC చికెన్ తింటుంటే షాక్... విదేశీయులకు చుక్కలు చూపిస్తున్న సీగల్ పక్షులు... VIDEO

KFC చికెన్ తింటుంటే షాక్... విదేశీయులకు చుక్కలు చూపిస్తున్న సీగల్ పక్షులు... VIDEO

సీగల్ షాక్ (image credit - youtube)

సీగల్ షాక్ (image credit - youtube)

Viral video: సాధారణంగా పక్షులు మనుషుల దగ్గరకు రావు. వస్తే పట్టేసుకుంటామని భయం. కానీ సీగల్ పక్షులు మనుషులకు సవాల్ విసురుతున్నాయి. ఆహారం ఎత్తుకుపోతున్నాయి. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.

    Viral video: మన దేశంలో పావురాలు ఎలాగో... విదేశీయులకు సీగల్ పక్షులు అలాగ. ఇవి కాస్త పెద్దగా, తెల్లగా, గుండ్రటి ముఖంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సముద్రంపై ఎగురుతూ ఆహారం సంపాదించుకునే ఆ పక్షులు... కొంతకాలంగా... రూట్ మార్చాయి. మనుషులపై దాడి చేసి మరీ ఆహారాన్ని పట్టుకుపోతున్నాయి. ఒక్కోసారి సూపర్ మార్కెట్లలోకి చొరబడి... చిప్స్ ప్యాకెట్లు ఎత్తుకుపోతున్నాయి. పోనీలే పక్షే కదా అని లైట్ తీసుకోలేకపోతున్నారు విదేశీయులు. ఎందుకంటే... రాన్రానూ వాటి దండయాత్ర కంట్రోల్ తప్పుతోంది. వాటి వల్ల ప్రజలు గాయపడే పరిస్థితి వచ్చేస్తోంది. తాజాగా అలాంటి ఓ ఘటన ఒకటి జరిగింది. ఆ వీడియో చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. పక్షేంటీ.. ఆ సాహసమేంటి... అని అంటున్నారు.

    స్థానిక ఓ బిజీ సెంటర్‌ దగ్గర KFC ఉంది. అక్కడికి వెళ్లిన కస్టమర్... వ్రాప్ కొనుక్కొని తింటుంటే... సరిగ్గా అప్పుడే దూసుకొచ్చిన సీగల్... అతని నోటి దగ్గర... వ్రాప్ పెట్టుకుంటుండగా ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించింది. ఓ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అయ్యింది. ఆ వీడియో ఇక్కడ చూడండి.

    సోఫీ ఎల్లెన్ మెక్‌గిల్ ఈ ఘటనను షూట్ చేశారు. తన ఫ్రెండ్ దగ్గర నుంచి సీగల్ ఎలా ఫుడ్ దొంగిలించిందో అందరికీ చూపించారు. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

    ఇదే నాకు జరిగి ఉంటే... నేను పక్షికే వదిలేసేవాణ్ని అని ఓ యూజర్ చెప్పారు. ఐతే... ఇదొక్కటే కాదు... ఇలాంటి చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఆ పక్షులకు సముద్రాలు, నదుల్లో చేపల ఆహారం దొరక్కపోవడంతో... అవి మనుషులపై ఆధారపడుతున్నాయి. మనుషులు తినే తిండిని ఎత్తుకుపోతున్నాయి. ఇలాంటి చాలా వీడియోలు ఇదివరకు వైరల్ అయ్యాయి.




    పావురాల లాగే... ఈ పక్షులు కూడా ఇప్పుడు ఇళ్లు, అపార్ట్‌మెంట్ల దగ్గర జీవిస్తూ... కావాల్సిన ఆహారాన్ని సంపాదించేసుకుంటున్నాయి. రాన్రానూ ఇవి మరీ దొంగల్లా తయారవుతున్నాయి. ఆహారాలను ఎత్తుకుపోవడం అలవాటు చేసుకున్నాయి. విదేశీయులకు ఇదో పెద్ద తలనొప్పిలా తయారైంది. అందుకే ఈ పక్షులపై వ్యతిరేకత పెరుగుతోంది.

    ఇది కూడా చదవండి: Viral pics: చనిపోయిన వారి దంతాలు, వెంట్రుక‌ల‌తో నగలు.. ఆస్ట్రేలియా మహిళ ప్రతిభ

    ఐతే... ఈ పక్షులు ఇలా మారిపోవడానికి మనుషులే కారణం అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. మనుషుల వల్లే సముద్రాలు, నదుల్లో ఆహారం దొరకకుండా పోతోందనీ... అందువల్లే ప్రాణాలకు తెగించి మరీ ఆ పక్షులు ఇలా ఆహారాన్ని ఎత్తుకెళ్లే దుస్థితి వచ్చిందని అంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: VIRAL NEWS, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు