SCOTTISH WOMAN REUNITED WITH MISSING CAT AFTER 17 YEAR CREDIT GOES TO MICROCHIP PAH
Viral News: 17 ఏళ్ల క్రితం తప్పిపోయిన పిల్లి మరలా దొరికింది... ఎలా సాధ్యమైందో తెలుసా..
తన పిల్లితో యజమానురాలు
Viral News: స్కాటీష్ కు చెందిన ఒక మహిళ ఒక పిల్లిని అపురూపంగా పెంచుకుంది. దాన్నితన ప్రాణంగా చూసుకునేది. ఎక్కడికి వెళ్లిన దాన్ని కనిపెట్టుకుని ఉండేది. అయితే, ఒక రోజు ఇల్లు మారేటప్పుడు ఊహించని సంఘటన జరిగింది.
Viral News: స్కాటీష్ కు చెందిన ఒక మహిళ ఒక పిల్లిని అపురూపంగా పెంచుకుంది. దాన్నితన ప్రాణంగా చూసుకునేది. ఎక్కడికి వెళ్లిన దాన్ని కనిపెట్టుకుని ఉండేది. అయితే, ఒక రోజు ఇల్లు మారేటప్పుడు ఊహించని సంఘటన జరిగింది.
Scottish Woman reunited with cat : స్కాటీష్ కు చెందిన కిమ్ కొల్లియార్ అనే మహిళ పిల్లిని ఎంతో ఇష్టంగా పెంచుకుంది. దాన్ని ఇంట్లో మనిషిగా భావించేది. దానిని ఎంతో ప్రత్యేకంగా చూసుకునేది. దాన్ని ప్రేమతో టిల్లీ అని పిలుచుకునేది. ఈ క్రమంలో ఒక రోజు ఊహించని సంఘటన జరిగింది. కిమ్ కొల్లియార్.. ఇల్లు మారాల్సి వచ్చింది. దీంతో తన పిల్లిని కూడా తన వాహనంలో ఎక్కించుకున్నారు.
ఏమైందో కానీ అది మాయమైంది. ఎక్కడికి పోయిందో తెలియలేదు. టిల్లీ కోసం.. కిమ్ కొల్లియార్ ఎంతగానో వెతికింది. కానీ అది దోరకలేదు. అప్పటి నుంచి దాని వెతకటానికి అనేక ప్రయత్నాలు చేస్తునే ఉంది. తన పిల్లి పోస్టర్ లను మార్కెట్ లో.. వీధుల్లో అతికించేది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేది. ఎప్పటికైన తన టిల్లీ తనకు.. దొరుకుందనే ఆశతో ఎదురుచూసేది.
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ (Trending News) కొనసాగుతుంది. ఎక్కడ ఏం జరిగిన నిముషాలలో వైరల్ గా మారిపోతున్నాయి. వీటిలో కొన్నిచూడటానికి భయంకరంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగాను ఉంటున్నాయి. జంతువులు, పెళ్లిళ్లు.. ఇలా రకారకాల కంటెంట్ ఉన్న సమాచారం వైరల్ అవుతునే ఉంటాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వెరైటీ వీడియోలను (Viral Videos) చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వెరైటీ వార్త వైరల్ గా మారింది. 17 ఏళ్ల క్రితం తప్పిపోయిన పిల్లి .. దాని యజమానిని చేరింది.
పూర్తి వివరాలు.. స్కాటీష్ కు (Scottish Woman) చెందిన 39 ఏళ్ల కిమ్ కొల్లియార్ అనే మహిళ... టిల్లీ అనే పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకునేది. ఒక రోజు ఆమె ఇల్లు మారాల్సి వచ్చింది. దీంతో ఆమె.. ఇంగ్లండ్ నుంచి స్కాట్లాండ్ లోని మిడ్లోథియన్ కొత్త ఇంటికి మారింది. ఈ క్రమంలో.. ఆమె తన పెంపుడు పిల్లి తప్పిపోయింది. ఎంత వేతికిన దాని జాడ దొరకలేదు. అయితే, కిమ్.. దాని ఫోటోలు ఉన్న పోస్టర్ లను అక్కడి పరిసరాల్లో అతికించింది. ఆమె.. పిల్లి మెడలో ఒక చిప్ ను పెట్టింది. దాన్ని ఎప్పుడు అప్ డేట్ చేస్తు ఉండేది. పిల్లి ఎప్పుడైతే తప్పిపోతే.. ముందుజాగ్రత్తగా దాన్ని మెడలో పెట్టింది.
అయితే, ఇలా కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. కానీ.. కిమ్ కొల్లియార్ మాత్రం తన... పిల్లి తిరిగి తన వద్దకు వస్తుందని గట్టి నమ్మకంతో ఉండేది. ఏ ఫోన్ కాల్ వచ్చిన... పిల్లి కోసమే నేమో.. అని అనుకొనేది. చివరకు ఒక రోజు జంతువులను కాపాడే ఒక సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. (స్కాటిష్ సోసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టూ ఎనిమల్) ఒక ఫోన్ వచ్చింది.
తమకు పిల్లి దొరికిందని , దాని మెడలోని చిప్ లో నంబర్, వివరాలు ఉన్నాయని తెలిపింది. దీంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు. (Scottish Woman reunited with cat) వెంటనే అక్కడికి చేరుకుంది. పిల్లి తప్పిపోయిన ప్రదేశంలోని తిరిగి లభించింది. ఆమె ఎంతో సంతోషించింది. ఆ వ్యక్తికి ధన్యవాదాలు తెలిపింది. తన టిల్లీని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్లి పోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో (Viral News) వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.