Viral News: నడిరోడ్డుపై గొడవలో ఊహించని ఘటన.. ఓ వ్యక్తి నాలుకను కొరికేసిన యువతి.. అంతలోనే మరో ట్విస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ఒక స్ట్రీట్ ఫైట్‌లో ఎవరూ ఊహించలేని ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై దాడి చేసిన మహిళ.. కోపంతో అతడి నాలుకను కొరికేసింది. దీంతో బాధితుడి నాలుక కొంచెం తెగిపోయింది. పక్కన ఉమ్మేసిన ఆ నాలుక భాగాన్ని..

  • Share this:
ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే.. కొంతమంది ఆసక్తిగా చూస్తారు. మరికొంత మంది మాత్రం వారిని విడిపించే ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది పోలీసులకు సమాచారం అందిస్తారు. కానీ స్కాట్లాండ్‌లో జరిగిన ఒక స్ట్రీట్ ఫైట్‌లో ఎవరూ ఊహించలేని ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై దాడి చేసిన మహిళ.. కోపంతో అతడి నాలుకను కొరికేసింది. దీంతో బాధితుడి నాలుక కొంచెం తెగిపోయింది. పక్కన ఉమ్మేసిన ఆ నాలుక భాగాన్ని ఒక సముద్రపు పక్షి తిని ఎగిరిపోవడం విశేషం. ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. స్కాట్లాండ్‌లోని ఈడెన్‌బర్గ్‌లో బెథనే ర్యాన్ అనే 27 ఏళ్ల యువతికి, జేమ్స్ మెకంజీ అనే వ్యక్తికి ఏదో విషయంలో గొడవ జరిగింది. క్షణాల్లోనే వారిద్దరూ ఒకరినొకరు దూషించుకుంటూ కొట్లాటకు దిగారు.

ర్యాన్‌పై దాడి చేయడానికి మెకంజీ పిడికిలి భిగించి ఆమె వైపుకు పరుగెత్తాడు. దీంతో ఆమె ఊహించని విధంగా మెకంజీకి లిప్ కిస్ పెట్టింది. అదే సమయంలో అతడి నాలుక అంచును గట్టిగా కొరకడంతో, అది తెగిపోయింది. దీంతో మెకంజీ ఏం జరిగిందో అర్థం కాలేదు. అతడు ఆ బాధలో ఉండగానే సీగల్ అనే సముద్రపు పక్షి అక్కడికి ఎగురుకుంటూ వచ్చింది. క్షణాల్లోనే నాలుకను తినేసి మళ్లీ ఎగిరిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రాసిక్యూటర్ సుసాన్ డిక్సన్ గత గురువారం ఈడెన్‌బర్డ్‌ షెరీఫ్ కోర్టుకు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 500 సార్లు వీర్యదానం చేసిన తండ్రి.. అమ్మాయిల జోలికి వెళ్లేందుకే భయపడిపోతున్న కొడుకు.. అసలు కథేంటంటే..

ఆ నివేదిక తాజాగా బయటకు వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ర్యాన్ మెకంజీకి పెదాలపై ముద్దు పెట్టిందని డిక్సన్ చెప్పారు. ఆ సమయ౦లో ఆమె అతడి నాలుక కొస భాగాన్ని కొరికి౦ది. దీంతో నాలుక తెగిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. మెకంజీ నోరంతా రక్తంతో తడిసిపోయింది. అతడు తెగిపోయిన నాలుకను బయటకు ఉమ్మేశాడు. వెంటనే అక్కడికి ఒక సీగల్ పక్షి వచ్చింది. ఆ నాలుకను తిని, ఎగిరిపోయింది. దీంతో అతడికి రీ ఎటాచ్‌మెంట్ సర్జరీ కూడా చేసే అవకాశం లేకుండా పోయింది. మెకంజీ నాలుక నుంచి రక్తస్రావం కాకుండా డాక్టర్లు చికిత్స చేశారు.
ఇది కూడా చదవండి: బావిలోంచి అరుపులు.. ఏంటా అని చూస్తే లోపల ఓ యువతి, ఓ యువకుడు.. అసలేం జరిగిందంటే..

గొడవకు కారణం ఏంటి? ప్రస్తుతానికి బాధితుడికి ఎలాంటి సర్జరీ అవసరం లేదని ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ ఘటనకు కారణమైన ర్యాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ముందు అంగీకరించింది. కానీ ఆమెకు, మెకంజీకి మధ్య గొడవ ఎందుకు జరిగిందనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదు. వాదనకు కారణాలు తెలియనప్పటికీ చేసిన తప్పుకి ఆమెను పోలీసులు అరెస్టు చేయడం విశేషం.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్.. రూ.3000 కోసం ట్రై చేస్తే.. ఏకంగా రూ.6,00,000 పోగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..
Published by:Hasaan Kandula
First published: