Home /News /trending /

SCORCHING HEAT IN THE UNITED ARAB EMIRATES HAS LEAD TO DEVISE DIFFERENT METHODS OF MAKING FAKE RAIN GH SRD

Fake Rains: ఇదేందయ్యా ఇది.. నేనేడా సూడలే.. మేఘాలకు షాకిచ్చి వర్షాలు కురిపిస్తున్నారుగా..ఎక్కడో తెలుసా..?

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Fake Rains: అక్కడి ప్రజలు ఎండ తీవ్రత, అధిక వేడితో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో దాదాపు 44 డిగ్రీల సెల్సియస్​కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు అక్కడి శాస్త్రవేత్తలు కృత్రిమ వర్షాలను సృష్టిస్తున్నారు.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం భారత్, చైనాతో పాటు కొన్ని యూరప్ దేశాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే.. ఎడారి ప్రాంతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​ (యూఏఈ) అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడి ప్రజలు ఎండ తీవ్రత, అధిక వేడితో ఇబ్బందులు పడుతున్నారు. యూఏఈలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు 44 డిగ్రీల సెల్సియస్​కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు అక్కడి శాస్త్రవేత్తలు కృత్రిమ వర్షాలను సృష్టిస్తున్నారు. ఇందుకోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. లోటు వర్షపాతాన్ని కవర్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆకాశంలోని మేఘాలు కరిగి అందులోని నీరు వర్షించేలా ఎలక్ట్రికల్​​ చార్జింగ్ టెక్నాలజీని శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు.

ఇలా ఎలక్ట్రికల్​​ టెక్నాలజీని వినియోగించుకొని వర్షాలు కురిపించే విధానాన్ని క్లౌడ్ సీడింగ్ అని పిలుస్తారు. డ్రోన్ల ద్వారా మేఘాల్లో విద్యుత్​ ప్రవహించేలా చేసి, అందులో ఉన్న నీరు కిందికి కురిసేలా చేయడమే ఈ క్లౌడ్ సీడింగ్​. మేఘాల్లో ఎల‌క్ట్రిక‌ల్ బ్యాలెన్స్‌ను మార్చి.. నీటి బిందువుల‌ను చార్జ్ చేయ‌డం ద్వారా మేఘాలు వర్షిస్తాయి. ఈ విధానం నీటి సమస్యను కూడా కొంత మేర తగ్గించేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కృత్రిమ వర్షాల కోసం రసాయనాలను ఉపయోగించడం కంటే ఎలక్ట్రిసిటీని వినియోగించడమే మేలనే వాదన కూడా ఉంది. కాగా అత్యంత పొడిగా ఉండే ప్రాంతాల్లో ఈ ఫేక్ వర్షాల పద్ధతిని యూఏఈలో ఇటీవలి కాలంలో విరివిగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వర్షపాతం అత్యల్పంగా నమోదయ్యే ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి కృత్రిమ వర్షాల కోసం ప్రయత్నిస్తున్నారు.

కృత్రిమ వర్షాల కోసం ప్రస్తుతం ఉన్న మిగిలిన పద్దతుల కంటే క్లౌడ్ సీడింగ్​ వైపే ఎక్కువగా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఈ పద్ధతిని పాటించేందుకు ముందుకు వస్తున్నాయి. అమెరికాలోనూ కొన్నిసార్లు స్వల్ప మార్పులతో ఈ పద్ధతిని అనుసరించారు. డ్రోన్ల సాయంతో మేఘాల్లోకి సిల్వర్ డయోడ్​ను పంపి కరిగేలా చేస్తారు. అప్పుడు మేఘాలు కరిగి వర్షంలా నీరు కురుస్తుంది.



తాజాగా యూఏఈ శాస్త్రవేత్తలు క్లౌడ్ సీడింగ్ పద్దతిలో కృత్రిమ వర్షాలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను యూఏఈ వాతావరణ శాఖ తమ అధికారిక ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో పోస్ట్ చేసింది. మామూలు వర్షంలాగే ఉండడంతో పాటు అప్పుడప్పుడు మెరుపులు కూడా వస్తున్నాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Dubai, Rains, UAE, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు