హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bee Hotels: తేనెటీగల సంరక్షణ కోసం 50 హోటల్స్.. మన ఇండియాలోనే.. ఎందుకంటే..

Bee Hotels: తేనెటీగల సంరక్షణ కోసం 50 హోటల్స్.. మన ఇండియాలోనే.. ఎందుకంటే..

Bee Hotels . (Credits: Twitter/@SpidersATSea)

Bee Hotels . (Credits: Twitter/@SpidersATSea)

Bee Hotels: బెంగళూరులోని అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ (ATREE) శాస్త్రవేత్తలు 'బీ హోటల్‌'ను (Bee Hotel) అభివృద్ధి చేశారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న ప్రాంతాలలో తేనెటీగలకు సురక్షితమైన ఇంటికి అందించడానికి మెరుగుపరిచిన కలపతో వీటిని తయారు చేశారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మానవ మనుగడకు తోడ్పడటంలో తేనెటీగలు (Bees) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మానవుడు (Human) పండించే పంటల్లో 70% తేనెటీగల పరాగసంపర్కం వల్లే పండుతున్నాయని అనడంలో సందేహం లేదు. అయితే తేనెటీగల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంతో వీటి ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు(Scientists) వాటిని సంరక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశం (India)లో మాత్రం తేనెటీగల సంరక్షణ ప్రయత్నాలు కాస్త తక్కువగానే జరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి బెంగళూరులోని అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ (ATREE) శాస్త్రవేత్తలు 'బీ హోటల్‌'ను (Bee Hotel) అభివృద్ధి చేశారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న ప్రాంతాలలో తేనెటీగలకు సురక్షితమైన ఇంటికి అందించడానికి మెరుగుపరిచిన కలపతో వీటిని తయారు చేశారు.

తేనెటీగలను నగరాల్లో కూడా పెంచడం, పరిరక్షణ ప్రయత్నాలలో పాల్గొనేలా పౌరులను ప్రోత్సహించడమే బీ హోటల్స్ ఉద్దేశం. పరిశోధకుల బృందం గత 10 నెలలుగా హోటల్ మోడల్‌పై పని చేస్తోంది. 2022, ఏప్రిల్‌లో ఆసక్తిగల వారు ఈ ప్రాజెక్టులో పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా బృందం పిలుపునిచ్చింది.

చాలామంది స్వచ్ఛందంగా ఇందులో పాల్గొనడానికి ముందుకు వచ్చారు. వారిలో చురుకైన వారిని ఎంపిక చేసుకున్న తర్వాత హోటళ్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. అలా బెంగళూరు అంతటా వివిధ ప్రదేశాలలో 50 బీ హోటళ్లను ఏర్పాటు చేయగలిగింది. వీటిలో కొన్ని పీపుల్స్ గార్డెన్స్‌లో, కొన్నింటిని వారి బాల్కనీలు లేదా టెర్రస్‌లలో అమర్చారు.

'బీ హోటల్' అనేది మూడు విభాగాలతో రెండు అడుగుల పొడవైన నిర్మాణమని పరిశోధకులు తెలిపారు. ఈ హోటల్ పైభాగంలో ముందుగా తయారు చేసిన రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలలోకి తేనెటీగలు వెళ్లి సురక్షితంగా ఉండొచ్చు. ఇక ఈ హోటల్ నిర్మాణం మధ్యలో వెదురు కర్రలు స్తంభాల్లాగా ఉంటాయి. కింద మట్టితో నిండిన ఖాళీ స్థలం ఉంటుంది.

బెంగుళూరు, ఆగ్నేయ కర్ణాటకలో కనిపించే వివిధ రకాల తేనెటీగలు వివిధ ఇళ్లు/తేనెతుట్టె నిర్మాణాన్ని ఇష్టపడుతుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశోధకులు హోటళ్లు రూపొందించారు. అన్ని తేనెటీగ జాతులు వచ్చి వీటిలో నివసించాలని కోరుకుంటున్నారు. అలానే ఒకే హోటల్‌లో నివసించే వివిధ జాతులు శాంతియుతంగా సహజీవనం చేయగలవా అనే కోణంలో అధ్యయనం చేయాలనుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : బరితెగించిన మహిళ..అలా చూపిస్తూ సెక్యూరిటీ గార్డుపై దాడి

"రాష్ట్రంలో తేనెటీగ జాతుల శాంపిల్స్ ఎవరు సేకరించలేదు. ఇప్పుడే మేం ఆ ప్రక్రియను ప్రారంభించాం. బెంగుళూరులో నివసించే తేనెటీగల సంఖ్య కచ్చితంగా తెలియదు. అందువల్ల, వివిధ పర్యావరణ వ్యవస్థలలో మానవ జోక్యం కారణంగా వాటి జనాభా ఎంత తగ్గుముఖం పట్టిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేక పోతున్నాం. అయితే, మా బృందం బెంగళూరులో తేనెటీగల జనాభాను శాంపిల్ చేసే పనిలో ఉంది" అని సీనియర్ రీసెర్చ్ ఫెలో చేతన క్యాసికర్ చెప్పారు.

బృందం పరిశీలనల ప్రకారం, ఒంటరి తేనెటీగలు బెంగళూరులో అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ తేనెటీగలు ఒంటరిగా ఉంటాయి ఇవి పెద్ద సంఖ్యలో తేనె లేదా తేనెటీగల సమూహాన్ని ఉత్పత్తి చేయవు. ఇవి రెచ్చగొట్టినప్పుడు కుట్టడం తెలిసిన తేనెటీగల్లా దూకుడుగా ఉండవు.

అందువల్ల, ఈ హోటళ్లను ఏర్పాటు చేస్తున్నప్పుడు తేనెటీగలకు భయపడవద్దని ప్రజలకు పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ హోటళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పార్టిసిపేంట్స్ పరిశీలనలను రికార్డ్ చేయడానికి 'బీ హోటల్' అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. వీరు హోటళ్లను ఇన్‌స్టాల్ చేసిన ప్రదేశం వివరాలు, హోటల్‌ను తేనెటీగలు ఆక్రమించడం, వదిలివేయడం వంటి వాస్తవ పరిశీలనలను అప్‌డేట్ చేయాలి.

First published:

Tags: Bees, Bengaluru, National News, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు