HOME »NEWS »TRENDING »scientists find almost intact carcass of wolf puppy which died over 57000 years ago ns gh

Ancient Wolf: బయటపడిన 50 వేల ఏళ్ల నాటి తోడేలు మృతదేహం.. చూసి షాకైన పరిశోధకులు.. ఎందుకంటే..

Ancient Wolf: బయటపడిన 50 వేల ఏళ్ల నాటి తోడేలు మృతదేహం.. చూసి షాకైన పరిశోధకులు.. ఎందుకంటే..
ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా జంతువులు చనిపోయిన తరువాత వాటి మృతదేహాలు కుళ్లిపోతాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ, చెక్కు చెదరకుండా ఉన్న తోడేలు పిల్ల కళేబరాన్ని తాజాగా పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
సాధారణంగా జంతువులు చనిపోయిన తరువాత వాటి మృతదేహాలు కుళ్లిపోతాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ, చెక్కు చెదరకుండా ఉన్న తోడేలు పిల్ల కళేబరాన్ని తాజాగా పరిశోధకులు గుర్తించారు. బంగారు గనిలో పని చేస్తున్న ఒక కార్మికుడికి ఇది కనిపించింది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను గుర్తించారు. బయటపడిన విషయాలను పరిశీలించి తొలుత వారు కూడా షాక్ కు గురవ్వడం విశేషం. ఈ ఆడ తోడేలు పిల్ల 57,000 సంవత్సరాల క్రితం చనిపోయి ఉండవచ్చని పరిశోధకులు తేల్చారు. కెనడాలోని యుకాన్‌ ప్రాంతంలో ఒక గుహలో ఉండగా, అది కూలిపోయి అది చనిపోయి ఉండవచ్చని వారు చెప్పారు. మంచు గుహ కూలిన తరువాత దాని మృతదేహం గడ్డకట్టిపోయింది. దీంతో అప్పటినుంచి అది అలాగే, వేల సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉంది.

కొనసాగుతున్న పరిశోధనలు


తోడేలు కణజాలాలన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయని పరిశోధకుల్లో ఒకరైన జూలీ మిచెన్ చెప్పారు. దాని బొచ్చు కూడా ఊడిపోలేదట. కానీ దాని కళ్ళు మాత్రం కనిపించలేదని తెలిపారు. దీనికి జుర్ అనే పేరు పెట్టారు. సాధారణంగా కళ్లు చాలా మృదువుగా ఉంటాయి. అందువల్ల చనిపోగానే అవి త్వరగా విచ్ఛిన్నమై కుళ్లిపోతాయని మిచెన్ చెప్పారు. పరిశోధకులు తోడేలు అస్థిపంజరాన్ని ఎక్స్ రే ద్వారా పరిశీలించారు. దాని బొచ్చు, దంతాలకు ఉండే ఎనామిల్ నమూనాలను విశ్లేషించారు. దీని ద్వారా మంచుయుగం నాటి పరిస్థితుల్లో భూమి, అప్పుడు జీవించిన తోడేళ్లు ఎలా ఉండేవో విశ్లేషించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

చేపలు తినేవట
చనిపోయేనాటికి తోడేలు ఎముకలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఇది 1.5 పౌండ్ల బరువు, ఒక అడుగు వరకు పొడవు ఉంది. దానికి కేవలం ఏడు వారాల వయసు ఉండవచ్చని తెలిపారు. దాని దంతాల ఎనామిల్‌ను విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. సమీపంలోని నది నుంచి తోడేళ్లు సాల్మన్ వంటి చేపలను వేటాడి తినేవని పరిశోధకులు గుర్తించారు. జుర్‌ DNAను ప్రస్తుతం ఉన్న తోడేళ్ల డీఎన్‌ఏతో పోల్చి చూశారు. ఉత్తర అమెరికాలో ప్రస్తుతం నివసిస్తున్న తోడేళ్లతో దీనికి సంబంధాలు ఉన్నాయని వారు గుర్తించారు. ఇది అప్పట్లో యూరేషియాలో జీవించిన తోడేళ్ల (grey wolves) కుటుంబానికి చెందినదిగా గుర్తించారు.
Published by:Nikhil Kumar S
First published:December 25, 2020, 14:18 IST