టీచర్ మీది బయటకు కనిపిస్తోంది.. విద్యార్థి చెప్పడంతో షాకైన టీచర్

టీచర్ మీది బయటకు కనిపిస్తోంది.. విద్యార్థి చెప్పడంతో షాకైన టీచర్ (ప్రతీకాత్మక చిత్రం)

ఈ విషయం నలుగురికీ తెలిసిపోయింది. ఆ తర్వాత ఆ విద్యార్థి... అత్యంత రహస్యంగా చెప్పాడు. కానీ ఏం లాభం అందరికీ తెలిసిపోయిందిగా. అందరూ చూసేశారుగా. ఆ తర్వాతేమైంది... ఆ టీచర్ స్పందనేంటి?

 • Share this:
  టీచర్‌ ఉద్యోగం చాలా కష్టమైనది. విద్యార్థుల ముందు నిల్చొని... పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ చూపంతా... టీచర్ పైనే ఉంటుంది. ఏం చెబుతున్నారో వినడమే కాదు... టీచర్ హావభావాలు, వేసుకున్న డ్రెస్సు అన్నీ వాళ్లు చూస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో... సరైన డ్రెస్ వేసుకోకపోతే... విద్యార్థులు కనిపెట్టేస్తారు. ఆ విషయం క్లాస్ రూంలో అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత టీచర్ పరువు పోయినంత పనవుతుంది. ఇదే పరిస్థితి వాషింగ్టన్‌లో సైన్స్ టీచర్ గ్రెగ్ డోనిట్జెన్ (Greg Donitzen)కి ఎదురైంది. ఆ టీచర్ వేసుకున్న ట్రౌజర్స్ (ప్యాంట్స్) విద్యార్థులకు నవ్వు తెప్పించింది. రోజంతా విద్యార్థులు నవ్వుతూనే ఉన్నారు. ఎందుకో టీచర్‌కి అర్థం కాలేదు. ఓ విద్యార్థి ఓ నోట్‌పై అసలు విషయం రాసి ఇచ్చాడు. క్లాస్ ముగిసే సమయంలో ఇలా చేశాడు. అప్పటికే ఈ విషయం క్లాసులో అందరికీ పాకేసింది.

  క్లాస్ ముగిసిన తర్వాత... టీచర్ ముందున్న డెస్కుపై ఓ విద్యార్థి నోట్ పెట్టి ఉంచాడు. అదేంటా అని గ్రెగ్ చూడగా... అసలు విషయం అర్థమైంది. ఆ నోట్‌లో "మీ ప్యాంట్స్‌లో ఓ కన్నం ఉంది. అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు" అని ఆ నోట్‌లో రాసి వుంది. అది చదవగానే... షాకైన టీచర్... నోటిపై చెయ్యి వేసుకున్నాడు.

  ఈ విషయాన్ని గ్రెగ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిరిగిన ప్యాంట్స్, ఆ నోట్ రెండింటినీ షేర్ చేశారు. ఇలా మరే టీచర్‌కైనా జరిగిందా అని ఆయన అడిగారు. మిగతా టీచర్లు కూడా స్పందించారు. తమ తమ అనుభవాల్ని చెప్పారు.

  విద్యార్థి రాసిన నోట్


  ఓ యూజర్... "అవును అలా నాకూ జరిగింది. ఓ రోజు నేను జిప్ వేసుకోవడం మర్చిపోయాను. క్లాస్ జరిగినంతసేపూ అలాగే ఉన్నాను." అని చెప్పగా... మరో యూజర్ "క్లాస్ అయ్యాక నా దగ్గరకు ఓ టీచర్ వచ్చాడు. క్లాస్ చెప్పేటప్పుడు చెయ్యి ఎత్తవద్దు అని చెప్పాడు. ఎందుకా అని చెయ్యి ఎత్తి గమనించాను. చంకలో కంపు కొడుతోంది" అని చెప్పారు.

  టీచర్ షాకైన సందర్భం (image credit - social media)


  ఇది కూడా చదవండి: Zodiac signs: ఏ రాశి వారు ఏ రంగు రాళ్లను ధరించాలి?

  మరో యూజర్ ఇంకో కథ చెప్పారు. "మా సెవెన్త్ గ్రేడ్ హిస్టరీ టీచర్... క్లాస్ చెబుతుండగా... ఆయన ప్యాంట్స్ ఊడిపోయింది. దాంతో ఆయన రోజంతా... డక్ట్ టేపుతో దాన్ని నడుముకు బలంగా అతికించుకున్నారు" అని చెప్పారు. ఇంకో యూజర్... "ఆ విద్యర్థి మీకు రెస్పెక్ట్ ఇచ్చాడు. మీ గురించి ఇతర విద్యార్థులు అలా మాట్లాడుకోవడం అతనికి ఇష్టం లేదు" అని అభిప్రాయపడ్డారు.
  Published by:Krishna Kumar N
  First published: