Dog on Track : సీరియస్‌గా ట్రాక్ ఫీల్డ్ పోటీలు.. మధ్యలో కుక్క వచ్చి ఏం చేసిందో తెలుసా?

రన్నింగ్ పోటీ జరుగుతుండగా కుక్క ఏం చేసిందంటే..

  • Share this:
    అమెరికాలోని ఉతా రాష్ట్రం లోగాన్‌లో జరుగుతు ఇంటర్ స్కూల్ గేమ్స్ (School Games) పోటీల్లో జరిగి సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైస్కూల్ గేమ్స్‌లో ట్రాక్ ఫీల్డ్ (రన్నింగ్) (Track and Field) పోటీలు జరుగుతుండగా ఒక కుక్క(Dog) మధ్యలో దూరి తాను కూడా పరుగెత్తడం మొదలు పెట్టింది. ఎంతలా పరుగెత్తిందంటే చివరకు ఆ పోటీలో అందరి కంటే ముందు పరుగెత్తుతున్న అథ్లెట్‌ను కూడా ఓడించి అదే ముందుకు వెళ్లిపోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా వైరల్‌గా మారింది. లోగన్ టౌన్‌లోని హైస్కూల్ గేమ్స్ సమీపంలోని ఒక ఒక ట్రాక్ ఫీల్డ్‌లో జరుగుతున్నాయి. రిలే పరుగులో గ్రేసీ లానీ టీమ్ అందరికంటే ముందున్నది. చివరి వ్యక్తి పరుగెత్తుతున్న సమయంలో హోలీ అనే పెంపుడు కుక్క గ్రేస్ పక్కన పరుగెత్తడం మొదలు పెట్టింది. అందరినీ దాటుకుంటూ రేసును ముగించింది. ఆ రేసును చూస్తున్న వారికి కాసేపు అక్కడ ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. గ్రేసీ లానీ పరుగెత్తుతుంటే జనాలు చప్పట్లు కొడుతున్నారు. తానే ముందు పరుగెత్తుతున్నందుకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారని భావించిందట.. కానీ చివరకు కుక్క పరుగుకు చప్పట్లు వచ్చాయని తెలుసుకొని తానూ నవ్వుకున్నది. అయినా కుక్క కంటే ముందుగా పరిగెత్తాలని భావించినా.. చివరకు కుక్కే విజయం సాధించింది.

    పోటీ ముగిసిన అనంతరం కుక్క యజమాని వచ్చి క్షమాపణలు చెప్పాడంటా. ప్రతీ రోజు తాను పరుగెత్తుతుంటే తన పక్కన హోలీ కూడా పరిగెడుతుందని.. అదే అలవాటుగా మారి పరుగు పందెంలో అథ్లెట్లకు పోటీగా పరుగెత్తిందని చెప్పాడు. అయితే పరుగు ముగిసిన అనంతరం కుక్క హోలీ అక్కడ మళ్లీ కనిపించలేదు. కాగా ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్టు చేయగా విపరీతంగా షేర్ అయ్యింది. అందే కాకుండా నెటిజన్లు దాన్ని ట్రోల్ కూడా చేస్తున్నారు.





    ఒక వ్యక్తి ఆ కుక్క తన కొడుకుదని.. అక్కడ పరుగు పందెంలో పాల్గొనకుండా చేయడం వల్లనే కుక్కను వదిలాడని చెప్పాడు. కుక్కను వదిలినందుకు నా కొడుకును మైదనాం నుంచి వెళ్లగొట్టాడని కూడా చెప్పారు. కానీ అది నిజం కాదని.. కేవలం ట్విట్టర్‌లో అటెన్షన్ కోరతూ అలా మెసేజ్ చేసినట్లు తెలిసింది. ఇక మరి కొందరు వాళ్ల కంటే కుక్కే బాగా పరుగెత్తిందని ప్రశంసించరు. మరి కొందరు వారు అంత స్లోగా పరిగెత్తితే ఇక ట్రాక్ ఫీల్డ్ చాంపియన్లు ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు. ఏదేమైనా స్కూల్ గేమ్స్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు నవ్వులు పూయిస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published: