కొన్ని రోజులుగా ఆకాశానికి రంధ్రం పడిందా అన్నట్లు వర్షం (Heavy rain) కురుస్తుంది. నదులు, చెరువులు, ప్రాజెక్టులు అన్ని నీళ్లతో నిండిపోయాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలు నీళ్లతో నిండిన నిండుకుండలా కన్పిస్తున్నాయి. ప్రజల జీవనమంతా అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ప్రాంతాలు జలదిగ్భందంలోనికి వెళ్లిపోయాయి. చాలా ప్రాంతాలలో బ్రిడ్జ్ ల మీద నుంచి నీరు ప్రవహిస్తుంది. అయితే.. కొంత మంది వాహన దారులు.. కుండపోతగా ప్రవహిస్తున్న వంతెన మీద నుంచి వాహనాలను పొనిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. కొందరు నీటి ప్రవాహంలో చిక్కుకుపోతున్నారు. కొన్ని వాహనాలు నీటిలో కొట్టుకుని పోతున్నాయి. ఈ కోవకు చెందిన మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ఖండ్ లో (Uttarakhand) షాకింగ్ ఘటన సంభవించింది. చంపావత్ జిల్లాలోని తనక్ పూర్ లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న పాఠశాల బస్సును.. డ్రైవర్, కండక్టర్ ఒక వైపు నుంచి మరోక వైపుకు తీసుకువెళ్తున్నాడు. బ్రిడ్జి మీద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. బస్సులు డ్రైవర్.. అనవసరంగా సాహాసం చేశాడు. వంతెన మీద నీరు ప్రవహిస్తుంది. అప్పుడు షాకింగ్ (Shocking) ఘటన చోటు చేసుకుంది.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు ముందుకు కదల్లేక పోయింది. ప్రవాహా వేగానికి బస్సు ఒక వైపు వంగి పోయింది. దీంతో అందరు చూస్తుండగానే.. బస్సు కిందపడిపోయింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్, కండక్టర్ నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. వెంటనే గ్రామస్థులు అక్కడికి వెళ్లి ఇద్దరిని కాపాడారు. అయితే, బస్సులో పిల్లలేవరు లేకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట (Social media) వైరల్ గా (Viral video) మారింది.
ఇదిలా ఉండగా వెడ్డింగ్ రిసెప్షన్ లో షాకింగ్ ఘటన జరిగింది.
హవాయి బిగ్ ఐలాండ్ పశ్చిమ తీరంలో కైలువా-కోనాలోని హులిహీ ప్యాలెస్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న హోటల్ లో పెళ్లి రిసెప్షన్ వేడుకను ప్లాన్ చేశారు. అప్పుడు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడ హజరయ్యారు. కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతుంది. అతిథులంతా.. పార్టీలో నిమగ్నమయ్యారు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. హవాయిలో సముద్రతీర వివాహ వేడుకలో భారీ అలల శ్రేణిని ఢీకొట్టింది.
దీంతో అక్కడి వారు.. భయంతో దూరంగా పరుగులు పెట్టారు. చూస్తుండగానే.. వెంట వెంటనే అలలు, ఒడ్డువైపునకు వచ్చాయి. దీంతో అతిథులు భయంతో పరుగులు పెట్టారు. కొంత మంది నీళ్లలో తడిసిపోయారు. అక్కడ ఉన్న కుర్చీలు, పదార్థాలంతా నీళ్లలో తడిసిపోయాయి. అక్కడి వారు.. ఈ ఘటనను వీడియో తీస్తున్నారు. ప్రస్తుతంఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా (Viral video) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus accident, Heavy Rains, Uttarakhand, Viral Video