SCENES OF TWO WOMEN CLASHING ON THE ROAD IN KANPUR UTTAR PRADESH VIDEO VIRAL ON SOCIAL MEDIA SNR
Video Viral:నడిరోడ్డుపై తల్లీకూతుళ్ల పంచాయితీ ..కొట్టుకుంటున్న వీడియో ఇదే
Photo Credit:Youtube
Ladies Fighting:నడిరోడ్డుపై ఇద్దరు ఆడవాళ్లు తన్నుకున్నారు. ఎందుకో తెలియదు. ఇద్దరి మధ్య వాగ్వాదం ఎందుకొచ్చిందో తెలియదు. ఆ ఇద్దరు మహిళలు మాత్రం తల్లి,కూతుళ్లని తెలుస్తోంది. అయితే ఒకరినొకరు ఒంటిపైన బట్టలు ఊడిపోయేలా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పండుగ రోజున నడిరోడ్డుపైన ఇద్దరు ఆడవాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఒంటిపైన ఉన్న దుస్తులు ఊడిపోయేలా, చీర చిరిగిపోయేలా తన్నుకున్నారు. చుట్టూ జనం చూస్తున్నారనే ఇంగితజ్ఞానం లేకుండా..ఆడవాళ్లు బజారెక్కి ఈవిధంగా ప్రవర్తించడం సరికాదనే విచక్షణ కోల్పోయి ఒకరి శిగలు మరొకరు పట్టుకొని ఓ గంటపాటు ముష్టియుద్ధం చేసుకున్నారు. ఇద్దరు ఆడవాళ్లు తన్నుకోవడం వింతగా అనిపించడంతో రోడ్లపై వెళ్లే జనం చూస్తుండిపోయారు. మరికొందరు తమ సెల్ఫోన్లు(Cell phones) తీసి ఆడవాళ్ల మధ్య జరుగుతున్న గొడవను వీడియో తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కాన్పూర్‌లో జరిగిన ఈ ఆడవాళ్ల గొడవ(Ladies Fighting)కు సంబంధించిన వీడియోనే తెగ వైరల్ అవుతోంది. ఇద్దరి ఆడవాళ్ల మధ్య గొడవ కాన్పూర్ (Kanpur)జిల్లా అక్బర్పూర్(Akbarpur)కొత్వాలి (Kotwali)ప్రాంతంలో జరిగింది. ప్రధాన కూడలి దగ్గర గొడవపడింది స్వయాన తల్లీకూతుళ్లని ట్రాఫిక్ పోలీసు(Trafic police)లు నిర్ధారించారు. ఏ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందో తెలియదు కాని..ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో గొడవ తారస్థాయికి చేరింది. ఇద్దరిలో ఒకరు నడి వయసు కలిగిన మహిళ అయితే మరొకరు యువతిగా వీడియోని బట్టి చూస్తే అర్ధమవుతోంది.
రోడ్డుపై తల్లీకూతుళ్ల రచ్చ..
నడిరోడ్డుపై తల్లీకూతుళ్లు ఈవిధంగా శిగలు పట్టుకొని కొట్టుకోవడంతో అటుగా వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకంగా మారింది. వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికి ఇద్దరూ దారివ్వకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి గొడవను చూస్తుండిపోయారు. కనీసం పోలీసులు కూడా చుట్టు పక్కల ప్రాంతాల్లో లేకపోవడంతో మహిళలు ఇద్దరూ మరింత రెచ్చిపోయి ఘర్షణ పడ్డారు. ఒకానొక సందర్భంలో నడివయస్సు కలిగిన మహిళ చీర పూర్తిగా ఊడిపోతున్న పట్టించుకోకుండా తగువులాడుకున్నారు. మెయిన్‌రోడ్డులో ఇంత న్యూసెన్స్ జరుగుతుంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు ఒక్కరు కూడా లేకపోవడం విచిత్రంగా చెప్పుకోవాలి.
పండగ పూట ఏందీ పంచాయితీ..
తల్లికూతుళ్లు ఇద్దరూ ఈవిధంగా 15నిమిషాల పాటు ఘర్షణ పడుతూనే ఉన్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు స్పాట్‌కి చేరుకున్నారు. మహిళలిద్దరికి సర్ది చెప్పి గొడవ పడవద్దని చెబుతున్నప్పటికి వినిపించుకోకుండా కొట్టుకుంటేనే ఉన్నారు. గొడవపడుతున్న వాళ్లిద్దరూ మహిళలు తల్లీ కూతుళ్లు కావడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. అయితే వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎందుకు తలెత్తిందనే విషయం మాత్రం ఎవ్వరికి అర్ధం కాలేదు. అయితే గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖాలు కనిపించేలా కొట్టుకుంటే బాగుండేది కదా అంటున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.