SBI: ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ ఇవే... అకౌంట్‌లో ఎంత ఉండాలో తెలుసుకోండి

SBI Monthly Average Balance rules | మెట్రో, సెమీ-అర్బన్, రూరల్ బ్రాంచ్‌లల్లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకుకు ఛార్జీలు చెల్లించాలి.

news18-telugu
Updated: November 21, 2019, 1:07 PM IST
SBI: ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ ఇవే... అకౌంట్‌లో ఎంత ఉండాలో తెలుసుకోండి
SBI: ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ ఇవే... అకౌంట్‌లో ఎంత ఉండాలో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్‌ని మార్చింది. అన్ని అకౌంట్లకు 2019 నవంబర్ 1 నుంచి నిబంధనలు మారాయి. కస్టమర్లు తమ అకౌంట్లలో సరిగ్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే జరిమానాలు తప్పవు. మెట్రో, సెమీ-అర్బన్, రూరల్ బ్రాంచ్‌లల్లో మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకుకు ఛార్జీలు చెల్లించాలి. అర్బన్ ప్రాంతాల్లోని బ్రాంచ్‌లో మీకు అకౌంట్ ఉంటే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.3,000 మెయింటైన్ చేయాలి. ఇందులో 50 శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.10+జీఎస్టీ చెల్లించాలి. బ్యాలెన్స్‌లో 50 నుంచి 75 శాతం తక్కువగా ఉంటే రూ.12+జీఎస్టీ చెల్లించాలి. 75 శాతం మించి తక్కువగా ఉంటే రూ.15+జీఎస్టీ చెల్లించాలి.

ఇలాగే సెమీ-అర్బన్, రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్‌లల్లో ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకు బ్రాంచ్‌లో అకౌంట్ ఉంటే రూ.2,000 మెయింటైన్ చేయాలి. ఇందులో 50 శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.7.5+జీఎస్టీ చెల్లించాలి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 50 నుంచి 75 శాతం తక్కువగా ఉంటే రూ.10+జీఎస్టీ చెల్లించాలి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మించి తక్కువగా ఉంటే రూ.12+జీఎస్టీ చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్‌లో అకౌంట్ ఉంటే రూ.1,000 మెయింటైన్ చేయాలి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 50 శాతం కన్నా తక్కువగా ఉంటే రూ.5+జీఎస్టీ ఛార్జ్ పడుతుంది. బ్యాలెన్స్‌ 50 నుంచి 75 శాతం తక్కువగా ఉంటే రూ.7.5+జీఎస్టీ చెల్లించాలి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మించి తక్కువగా ఉంటే రూ.10+జీఎస్టీ చెల్లించాలి.

Realme X2 Pro: 33 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్... రియల్‌మీ ఎక్స్2 ప్రో ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

FASTag: మీ వాహనానికి ఫాస్ట్‌ ట్యాగ్ ఉందా? ఈజీగా కొనండి ఇలా

Tata Sky: అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఫ్రీగా ఇస్తున్న టాటాస్కై
Loading...
Aadhaar Seva Kendra: గుడ్ న్యూస్... ఇక వారంలో 7 రోజులు పనిచేయనున్న ఆధార్ సేవా కేంద్రాలు

 
First published: November 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...