ముసలోడే! కానీ మహానుభావుడు!! అని ఆశ్చర్యపోడానికి, అతిశయోక్తి చెందడానికి అన్ని అర్హతలున్న ఈ తాతగారు మామూలోడు కాదు. నిండు నూరేళ్లు బతకడమే అరుదనుకుంటే, సెంచరీ తర్వాత కూడా సూపర్ ఫాస్ట్ లా పరుగుతుతీస్తున్నాడీయన. పేరు సావాంగ్ జన్‌ప్రామ్. వయసు 102 ఏళ్లు. ఆ వయసులో పరుగుపందెంలో పాల్గొనడమేకాదు, ఏకంగా 100 మీటర్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టేశాడు. తాత వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
థాయిలాండ్‌లో సౌత్‌వెస్టర్న్ సాముత్ సోంగ్‌క్రామ్ ప్రావిన్స్‌కు చెందిన సావాంగ్ జాన్‌ప్రామ్ వయసు 102 ఏళ్లు. గత వారం థాయిలాండ్ లో 26వ ఇటెరేషన్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో 100-105 ఏళ్ల కేటగిరీలో జరిగిన అన్ని ఈవెంట్లలోనూ మనోడే విజేతగా మెడల్స్ మెడలో వేసేసుకున్నాడు. స్వతహాగా అథ్లెట్ కావడం, వంద తర్వాత కూడా ప్రాక్టీస్ కొనసాగిస్తుండటంతో సావాంగ్ కు ఈ ఘనత సాధ్యమైంది. అంతేకాదు,
సౌత్ఈస్ట్ ఏసియన్‌లోనే అత్యంత ఎక్కువ వయసు ఉన్న స్ప్రింటర్‌గా సావాంగ్ చరిత్ర సృష్టించాడు. గత వారం జరిగిన ఈ చాంపియన్ షిప్ పోటీలలో 100 నుంచి 105 ఏళ్ల కేటగిరీలో సవాంగ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ 102 ఏళ్ల వృద్ధుడు 100 మీటర్ల పరుగుపందేన్ని జస్ట్ 27.08 సెకండ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.
Sawang Janpram, 102, broke the Thai 100m record – for centenarians – at the annual Thailand Master Athletes Championships https://t.co/GZcaQGrAoR pic.twitter.com/OxqGLiXySI
— Reuters (@Reuters) March 3, 2022
102 ఏళ్ల వయసులో కూడా సావాంగ్‌కు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవట. అందుకే ఉదయం లేవగానే వాకింగ్ చేయడం.. జాగింగ్ చేయడం అలవాటుగా చేసుకున్నాడు. యువత ఫిజికల్ టిప్స్ కోసం ఈ తాతను కలుస్తుంటారు. సావాంగ్ కూతురైన 70 ఏళ్ల సిరిపాన్ ఆయనకు ట్రైనర్ గా వ్యవహరిస్తోంది. ఆరోగ్యంతోపాటు పాజిటివ్ మైండ్ సెట్ తన తండ్రి విజయరహస్యమని కూతురు సిరిపాన్ గర్వంగా చెబుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Old man, Thailand, Viral Video