సముద్రంలో (Ocean) అలలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే తీరంలోనే ప్రజలు వాటిని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక కొంత మంది కావాలని వీటిపై సర్ఫింగ్ కూడా చేస్తుంటారు. సముద్రాన్ని కొంత మంది దగ్గర నుంచి చూడటానికి ఇష్టపడుతుంటారు. వీరు బోటుల్లో, పెద్ద స్టీమర్ లలో సముద్రంలో వెళ్తుంటారు. అయితే, సముద్ర అలలు (Sea wave) చూడటానికి ఎంత అందంగా ఉంటాయో.. కొన్ని సార్లు అంతే భయంకరంగాను ఉంటాయి. అవి ఎగిసి పడి తీరంలోని, లేదా సముద్రలోని పెద్ద పెద్ద పడవలనే ముంచేస్తాయి.
Perfect wave touching the clouds.. pic.twitter.com/93RsgS3YvC
— Buitengebieden (@buitengebieden) May 3, 2022
పంచ భూతాల్లో ఒకటైన నీటి పట్ల మన జాగ్రతలో మనం ఉండి ప్రకృతిని ఎంజాయ్ చేయాలి. ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా (viral video) మారంది. దీనిలో కొన్ని అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అవి ఆకాశంలో మేఘాలను తాకుతూ కిందకు (Sea Wave Touching Clouds) పడుతున్నాయి. అయితే, అవి మేఘాలను ఏరోసాల్ పొర మాదిరిగా ఒక పొగలాంటి లేయర్ ఏర్పడింది. అక్కడ సముద్రం వాటిని తాకుతూ మరల కిందకు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సీన్ చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఈ వీడియో గతంలోనే సోషల్ మీడియాలో (Social media) ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతం మరల వీడియో వైరల్ గా మారింది.
Man dances with 2 giant pythons on his shoulders
సాధారణంగా కొంత మందికి పాములు, కొండ చిలువలంటే తెగ భయపడిపోతుంటారు. ఇక కొందరైతే దాని పేరు ఎత్తడానికి కూడా ధైర్యం చేయరు. పాములు, ఆహారం కోసం, దారితప్పి మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. అలాంటి సమయంలో చాలా అరుదుగా మనుషులను కాటువేస్తాయి. ఇక కొండ చిలువలు ఎక్కువగా కొండ ప్రాంతాలు, అడవులలో ఎక్కువగా ఉంటాయి.
కొందరు పాములు, కొండ చిలువలను చూస్తే చేసే రచ్చ మాములుగా ఉండదు. కొందరు స్నేక్ క్యాచ్ సొసైటీకి వారికి సమాచారం అందిస్తారు. మరికొందరు.. అక్కడి దరిదాపుల్లోకి వెళ్లడానికి ధైర్యం చేయరు. స్నేక్ క్యాచర్ చాలా కష్టపడి పాములను పట్టుకుంటారు. ఇక కొందరు పాములు, కొండ చిలువలతో సరదాగా ఆడుకుంటారు. ఇలాంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఈ వీడియోలో ఒక వ్యక్తి కొండ చిలువను తన ఇంట్లో పెంచుకుంటున్నాడు. రెండు కొండ చిలువలు వీడియోలో కన్పిస్తున్నాయి. వాటిని తన చేతిలో పట్టుకుని డీజేపాటను పెట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు. రెండు పైథాన్ లను తన వీపుపై మోసుకుంటు పాటకు తగినట్టుగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే పైతాన్ ను బాలిక ఆడుకున్న వీడియోలు వైరల్ గా మారాయి. తాజగా,ఈ వీడియో వైరల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ocean, Viral Video