Home /News /trending /

SAUDI ARABIA BANS MEN FROM MARRYING WOMEN FROM PAKISTAN BANGLADESH CHAD AND MYANMAR SAYS REPORT NK

ఆ నాలుగు దేశాల మహిళల్ని పెళ్లాడొద్దు... తాజా ఆదేశాలతో మగాళ్లకు షాక్

ఆ నాలుగు దేశాల మహిళల్ని పెళ్లాడొద్దు... తాజా ఆదేశాలతో మగాళ్లకు షాక్ (ప్రతీకాత్మక చిత్రం)

ఆ నాలుగు దేశాల మహిళల్ని పెళ్లాడొద్దు... తాజా ఆదేశాలతో మగాళ్లకు షాక్ (ప్రతీకాత్మక చిత్రం)

ప్రభుత్వాలు జారీ చేసే ఆదేశాలు ఒక్కోసారి ప్రజలకు ఇబ్బందిగా మారతాయి. లేనిపోని చిక్కులు తెచ్చిపెడతాయి. ముఖ్యంగా వివాహాలపై ఆదేశాలతో సమస్యలు ఎక్కువవుతాయి. తాజా ఆర్డర్ వల్ల కలుగుతున్న సమస్యేంటో తెలుసుకుందాం.

    సౌదీ అరేబియా జారీ చేసిన తాజా ఆదేశం ఆ దేశంలో కలకలం రేపుతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌కి చెందిన మహిళల్ని పెళ్లి చేసుకోవద్దని... సౌదీ పాలకులు ఆదేశాలు జారీ చేసినట్లు సౌదీ మీడియా చెబుతోందని పాకిస్థాన్‌కి చెందిన డాన్ రిపోర్ట్ చేసింది. అనధికారిక లెక్కల ప్రకారం... ఈ నాలుగు దేశాలకు చెందిన 5 లక్షల మంది మహిళలు ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నారు. ఇన్నాల్లూ సౌదీ అరేబియా ప్రజలు ఈ నాలుగు దేశాల ప్రజలను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ పడేవారు కాదు. ఇప్పుడు తాజా ఆదేశాలతో ఈ దేశాల మహిళల్ని పెళ్లి చేసుకుంటే... కఠిన నిబంధనలు అడ్డొస్తాయి అని మక్కా డైలీ రిపోర్ట్ చేసింది. అసలీ కండీషన్ ఎందుకు అంటే... సౌదీ అరేబియా ప్రజల్లో విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని పాలకులు భావించినట్లు తెలిసింది. ఎవరైనా తప్పనిసరిగా విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలంటే... కొన్ని అదనపు రూల్స్ పాటించాల్సి ఉంటుంది.

    ఇప్పుడు విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలి అనుకునే సౌదీ అరేబియా పురుషులు... తప్పనిసరిగా ప్రభుత్వానికి మ్యారేజ్ అప్లికేషన్ పెట్టుకోవాలి. దాన్ని పరిశీలించి ప్రభుత్వం ఆమోదించాలో లేదో నిర్ణయిస్తుంది. ఎవరైనా విడాకులు తీసుకొని... మళ్లీ పెళ్లికి రెడీ అయితే... వారు 6 నెలల దాకా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని డైరెక్టర్ మేజర్ జనరల్ అస్సాఫ్ అల్ ఖురేషీ తెలిపారు.

    అప్లికేషన్ పెట్టుకునేవారి వయస్సు 25 ఏళ్లు దాటి ఉండాలి. అప్లికేషన్‌పై ముందుగానే స్థానిక జిల్లా మేయర్ సంతకం పెట్టి ఉండాలి. గుర్తింపు పత్రాలు (ఐడీ కార్డులు), ఫ్యామిలీ కార్డు కాపీ వంటివి సమర్పించాలి.

    ఇది కూడా చదవండి:Free Food: దేవుడా... ఫ్రీ మీల్స్ కోసం ఏకంగా పేరే మార్చుకుంటున్నారు... ఎక్కడో తెలుసా?

    ఇవన్నీ ఇబ్బందికరమైన అంశాలే. సౌదీ అరేబియాలో ఏళ్లుగా విదేశీయులు ఉంటున్నారు. అందువల్ల వారితో స్థానికులకు పరిచయాలు ఉంటాయి. పెళ్లి సంబంధాలూ కుదురుతాయి. ఇలా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటే... ఎలా అన్నది తలెత్తుతున్న ప్రశ్న. ఐతే... అక్కడ పాలకులకు ఎదురు తిరిగే పరిస్థితి లేదు. ఎవరైనా సరే రూల్స్ పాటించాల్సిందే. అందుకే ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో సౌదీ అరేబియాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం... ఆ రెండు దేశాలకూ ఇబ్బంది కలిగించేదే. ఇక చాద్. మయన్మార్‌కి సౌదీ పాలకులతో అంతగా సంబంధాలు లేవు. అందువల్ల ఆ దేశాలు ఈ రూల్‌ని పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవనుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Bangladesh, Myanmar, Pakistan, Saudi Arabia

    తదుపరి వార్తలు