చెల్లి భర్తకు 3లక్షల కట్నం డిమాండ్ చేసిన సానియా మిర్జా... వీడియో వైరల్

ఆనమ్ పెళ్లి వేడుకలో సానియ సందడి చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

news18-telugu
Updated: December 14, 2019, 1:16 PM IST
చెల్లి భర్తకు 3లక్షల కట్నం డిమాండ్ చేసిన సానియా మిర్జా... వీడియో వైరల్
సానియా మీర్జా, అసద్, అనమ్ మీర్జా
  • Share this:
టెన్నిస్ స్టార్ సానిమా మీర్జా ఇంట మరో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. సానియా సోదరి ఆనమ్ మీర్జా వివాహ వేడుక ఘనంగా జరిగింది. అయితే చెల్లెలి పెళ్లి వేడుకలో సానియా ఫుల్‌గా సందడి చేసింది. ఆనమ్ మెహిందీ ఫంక్షన్‌లో కూడా మెరిసింది. అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్‌‌తో సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖులను సానియా, అజారుద్దీన్ ఆహ్వానించారు. అయితే ఆనమ్ పెళ్లి వేడుకలో సానియ సందడి చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి సందర్భంగా పెళ్లికూతురు ఇంటికి తొలిసారిగా వచ్చిన పెళ్లికొడుకొకి కట్నం డిమాండ్ చేస్తారు. ఈ సంప్రదాయం చాలా హిందు కుటుంబాల్లోనే కాకుండా ముస్లీం కుటుంబాల్లో కూడా ఉంది. తెలుగువారు దీన్ని ఆడపడచుల కట్నంగా, మరదల్ల కట్నంగా చెబుతుంటారు. అదే ముస్లీంలోనే అయితే ఈ వేడుకను థింగానా అంటారు. ఈ సందర్భంగా అసద్‌ను లోపలికి అనుమతించేందుకు తనకు మూడు లక్షల రూపాయలు కట్నంగా ఇవ్వాలని ఇంటి మెయిన్ గేట్ వద్ద సానియా మీర్జా డిమండ్ చేసింది. తాజాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>