Home /News /trending /

SANGAMESHWARASWAMY TEMPLE IS LOCATED IN THE NAGARKURNOOL DISTRICT AND IS VISITED ONLY FOUR MONTHS OF THE YEAR SNR NNK NJ

Nagarkurnool: ఏడు నదులు కలిసే ప్రదేశం..ఏడాదిలో నాలుగు నెలలే దర్శనం..!

(ఆ ఆలయ దర్శనం 4నెలలే..)

(ఆ ఆలయ దర్శనం 4నెలలే..)

Nagarkurnool:భక్తులకు విశిష్ట అనుభూతి, దివ్యదర్శనాన్ని కలిగించే ఆలయం అది. కాని ఏడాది పొడవున దర్శించుకునే అవకాశం మాత్రం ఉండదు. కేవలం వేసవి మొదలైన నాటి నుంచి నాలుగు మాత్రమే ఆలయం కనిపిస్తుంది. తర్వాత మాయమైపోయింది. అంతటి అద్భుతమైన ఆలయం ఎక్కడుందంటే ..

ఇంకా చదవండి ...
    (N.Naveen Kumar,News18,Nagar Kurnool)

    ఏ ఆలయమైన గ్రహణం సమయంలో మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఆ గుడి మాత్రం ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనభాగ్యాన్ని కలిగిస్తుంది. మరి మిగిలిన ఎనిమిది నెలలు గుడి అక్కడ ఉండదా లేక మూసివేస్తారా అనే అయోమయం అవసరం లేదు. ఎందుకంటే  ఆ 8నెలలు ఆలయం మాయమైపోతుంది. నిజంగానే నాలుగు నెలలు బయటకు కనిపించే సంగమేశ్వరస్వామి (Sangameshwaraswamy) ఆలయం మిగిలిన 8నెలలు నీళ్లలో ఉంటుంది.  తెలంగాణ(Telangana)లోని నాగర్‌కర్నూలు (Nagarkurnool)జిల్లా కొల్లాపూర్‌(Kolhapur)నియోజకవర్గ సరిహద్దుల్లోని కృష్ణానది (Krishnariver)లో కొలువై ఉన్నదే సంగమేశ్వరస్వామి ఆలయం. అంతటి విశిష్టత కలిగిన ఆలయాన్ని చూడాలంటే సరిగ్గా ఈ సమయంలో కుదురుతుంది. వేసవి కాలం ప్రారంభవగానే అంటే  ఫిబ్రవరి(February)నెల నుంచి జూన్(June)వరకు శ్రీశైలం(Srisailam)నదిలోని నీరు తగ్గిపోవడంతో ఆలయం దర్శనమిస్తుంది. అప్పుడే సంగేశ్వరాలయంలో లింగరూపంలో కొలువైన శివుడికి భక్తులు, అర్చకులు అభిషేకాలు, ప్రత్యేకపూజలు, ఆరాధనలు నిర్వహిస్తారు.

    శాసనాలు ఏం చెబుతున్నాయి..?
    వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పవిత్రస్థలం ఎందరో మునులకు తపస్సుకు చేసుకునేందుకు ఆశ్రయమిచ్చినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలోని పూజారులు చెప్పిన స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో... ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని పురాణాలు చెబుతున్నాయి. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి ఈ ఆలయాన్ని నివృత్తి సంగమేశ్వరాలయంగా కూడా ప్రసిద్ది కెక్కింది.

    (సంగమేశ్వరలాయం)


    మరో పురాణం ప్రకారం..
    ఈ ప్రాచీన ఆలయానికి భాగవతపురాణంతో కూడా సంబంధం ఉన్నట్లుగా ఇక్కడి భక్తులు చెబుతుంయారు. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు. ఆ శివలింగాన్ని తేవడానికి భీముడు కాశీకి వెళ్లి ప్రతిష్టాపన సమయానికి చేరుకోకపోవడంతో బుషుల సూచన మేరకు వేప మొద్దుని శివలింగంగా మలిచి ధర్మరాజు ప్రతిష్టించి పూజలు చేశారనే ప్రతీతి. దీనిపైనే భీముడు ఆగ్రహించి తాను తెచ్చిన శివలింగాన్ని కృష్ణానదిలో విసిరేశారని..భీముడ్ని శాంతింపజేయడానికే ఆయన తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టారని స్థల పురాణం చెబుతోంది.

    గతమెంతో ఘనం..
    ఒకప్పుడు దేదీవ్యమానంగా వెలిగిన సంగమేశ్వరస్వామి ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ఈ నాలుగు నెలలు భక్తులకు కనిపించే ఆలయాన్ని రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా చుట్టు పక్కల శిథిలమైన ఆలయ నిర్మాణాలు చూస్తుంటే అర్ధమవుతుంది. ఆలయ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ అవన్నీ ఇప్పుడు కనిపించవు. అన్నీ కాలగర్భంతో పాటు నగీగర్భంలో కలిసిపోయాయి. వేల ఏళ్ల చరిత్ర కలిగిన సంగమేశ్వరాలయం ప్రస్తుతం తెరిచి ఉండటంతో..స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nagar kurnool, Temple

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు