• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • SAN FRANCISCO UBER CAB DRIVER ASSAULTED AFTER TELLS WOMEN TO WEAR MASK VIDEO GOES VIRAL SU

Viral Video: మాస్క్ పెట్టుకోమంటే వాయించేసిన మహిళలు.. మంచి చెప్పడమే పాపం అయింది..

Viral Video: మాస్క్ పెట్టుకోమంటే వాయించేసిన మహిళలు.. మంచి చెప్పడమే పాపం అయింది..

డ్రైవర్‌‌ను దూషిస్తున్న మహిళలు(Image-Instagram)

కరోనా వైరస్ నేపథ్యంలో బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి అని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

  • Share this:
    కరోనా వైరస్ నేపథ్యంలో బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి అని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరిస్తున్నారు. మాస్క్ పెట్టుకోమని ఎవరికైనా సలహా ఇస్తే వారే ఎదురుదాడికి దిగిన ఘటనలు చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. మాస్క్ ధరించమని చెప్పినందుకు ఓ మహిళ మరో ఇద్దరు మహిళలతో కలిసి క్యాబ్ డ్రైవర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఏబీసీ 7 రిపోర్టర్ డియోన్ లిమ్ షేర్ చేశారు. ఈ ఘటన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో చోటుచేసుకుంది.

    ఇక, ఆ వీడియోలో క్యాబ్ డ్రైవర్ శుబకర్.. వెనక సీట్‌లో ముగ్గురు మహిళలు కూర్చున్నారు. అందులో ఓ మహిళ ఫోన్‌తో బీజిగా ఉంది. మరో ఇద్దరు మహిళలు క్యాబ్ డ్రైవర్‌తో వాదనకు దిగారు. మాస్క్ ధరించమని చెప్పడంతో వారు డ్రైవర్‌ను దూషించడం ప్రారంభించారు. దీంతో డ్రైవర్ వాహనాన్ని పక్కకు ఆపేశాడు. వారిని కారు దిగాల్సిందిగా కోరాడు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించాడు. అయితే అందుకు వారు నిరాకరించారు. అతనిపై తిట్ల వర్షం కురిపించారు. మాస్క్ ధరించమని చెప్పినందుకు ఓ మహిళ ఏకంగా డ్రైవర్ వద్దకు వచ్చి దగ్గడం కూడా చేసింది. అలాగే అతని ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా క్యాబ్ డ్రైవర్ మాస్క్‌ను కూడా తొలగించారు.










    View this post on Instagram






    A post shared by Dion Lim (@dionlimtv)






    ఇక, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాబ్ డ్రైవర్‌తో దురుసుగా ప్రవర్తించిన మహిళలపై చర్యలు తీసుకుంటామని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు తెలిపారు. ఇక, నేపాల్‌కు చెందిన శుభకర్ మూడేళ్లుగా శాన్‌ఫ్రాన్సిస్కో‌లో ఉబెర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
    Published by:Sumanth Kanukula
    First published: