హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Samsung: శామ్‌సంగ్ షాకింగ్ నిర్ణయం.. గెలాక్సీ FE సిరీస్ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి ఆపేసే అవకాశం

Samsung: శామ్‌సంగ్ షాకింగ్ నిర్ణయం.. గెలాక్సీ FE సిరీస్ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి ఆపేసే అవకాశం

సామ్ సంగ్ ఫోన్

సామ్ సంగ్ ఫోన్

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ శామ్‌సంగ్.. ఇకపై గెలాక్సీ ఎఫ్‌ఈ (Galaxy FE) స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉంది. గెలాక్సీ S FE లేదా ఫ్యాన్ ఎడిషన్ తరహా  ఫోన్‌లను ఇప్పటికే మార్కెట్లో పెద్దసంఖ్యలో విడుదల చేసింది.

ఇంకా చదవండి ...

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ శామ్‌సంగ్.. ఇకపై గెలాక్సీ ఎఫ్‌ఈ (Galaxy FE) స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉంది. గెలాక్సీ S FE లేదా ఫ్యాన్ ఎడిషన్ తరహా ఫోన్‌లను ఇప్పటికే మార్కెట్లో పెద్దసంఖ్యలో విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ఇదే సిరీస్‌లో రావాల్సిన గెలాక్సీ S 22 FE మోడల్‌ను లాంచ్ చేసే అవకాశాలు లేవని తాజా నివేదిక పేర్కొంది. ఈ రిపోర్టులో పేర్కొన్న ప్రకారం.. శామ్‌సంగ్ FE లైనప్‌ను పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది. FE లైనప్‌ అనేది.. రూ. 60,000 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే యూజర్ల కోసం తీసుకొచ్చిన టోన్-డౌన్ ఫ్లాగ్‌షిప్ మోడల్. కంపెనీ డీసెంట్ ఫీచర్స్ సెట్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూపొందించింది.

సమీప భవిష్యత్తులో మరిన్ని FE మోడళ్లను లాంచ్ చేయడానికి శామ్‌సంగ్ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనబడడం లేదు. Galaxy S ఫ్లాగ్‌షిప్ ఫోన్.. ధర విషయంలో FE మోడల్‌కు ఎక్కువ లేదా తక్కువ దగ్గరగా ఉంటుంది. మరోపక్క మొబైల్ పరిశ్రమ చిప్ కొరత, అధిక ఉత్పత్తి ఖర్చులతో సతమతవుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని భావించి ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయమే. ఎందుకంటే మరింత జనాదరణ పొందిన ప్రొడక్ట్స్‌పై ఎక్కువగా దృష్టి సారించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.

ఇటీవల కాలంలో ఇలాంటి మార్కెట్ నిర్ణయాలతో శామ్‌సంగ్ అందర్నీ ఆశ్చర్య పర్చుతోంది. ఇప్పటికే Galaxy Note లైనప్‌ను కంపెనీ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని స్థానంలో ఈ ఏడాది S పెన్ సపోర్ట్‌తో Galaxy S అల్ట్రా ఫోన్‌ను లాంచ్ చేసింది. తాజాగా Galaxy FE లైనప్‌ను ప్లగ్‌ పుల్ చేయడానికి అవకాశం ఉంది.

అయితే గెలాక్సీ ఎఫ్‌ఈ సిరీస్‌ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇప్పటివరకు శామ్‌సంగ్ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో వచ్చే ఏడాది ఎప్పుడైనా లాంచ్ చేయడానికి ఉద్దేశించిన గెలాక్సీ ఎస్ 22 ఎఫ్‌ఈ మోడల్‌కు సంబంధించిన సమాచారం లీక్ అవ్వాలని న్యూ రిపోర్ట్ అశిస్తుంది. గెలాక్సీ ఎస్ 22 ఎఫ్‌ఈ మోడల్ కంటే ముందు న్యూ Galaxy Z Fold, Z Flip 4 స్మార్ట్‌ఫోన్‌లను ఓ ఈవెంట్‌లో పరిచయం చేసే అవకాశం లేకపోలేదు. ఇది ఆగస్టులో జరిగే అవకాశం ఉంది.

మరోవైపు ఫీచర్ ఫోన్ మార్కెట్ నుంచి నిష్క్రమించాలని కూడా శామ్‌సంగ్ భావిస్తోంది. దీంతో సదరు కంపెనీ రూ .15,000 కంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడంపై దృష్టి సారించనుంది. గ్లోబల్ ద్రవ్యోల్బణం, విడిభాగాల కొరతతో, స్మార్ట్‌ఫోన్‌ల ధరలు గత కొన్ని నెలలుగా పెరిగాయి. మరోపక్క శామ్‌సంగ్ తయారీ భాగస్వామి అయిన డిక్సన్ కూడా తక్కువ-ధర ఫోన్‌లను తయారు చేయడం ఆపి వేసే అవకాశం ఉండడం కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమై ఉండవచ్చు. అయితే ఫీచర్ ఫోన్‌ల ఉత్పత్తి ఈ ఏడాది చివరి నాటికి ఆగిపోతుందా లేదా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా తయారీ లైన్ల నుంచి క్రమంగా నిలిపివేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

First published:

Tags: Samsung Galaxy, Smart phones, Trending news

ఉత్తమ కథలు