హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Snake bite:పాము ప్రతీకారం.. ఒకే వ్యక్తిని.. ఏడు నెలల్లో ఏడు సార్లు కాటేసిన సర్పం.. కారణం ఏంటంటే..

Snake bite:పాము ప్రతీకారం.. ఒకే వ్యక్తిని.. ఏడు నెలల్లో ఏడు సార్లు కాటేసిన సర్పం.. కారణం ఏంటంటే..

ఏడుసార్లు పాము కాటుకు గురైన వ్యక్తి

ఏడుసార్లు పాము కాటుకు గురైన వ్యక్తి

Uttar pradesh:  ఒక వ్యక్తి పొలంలో పనులు చేస్తుండగా పాములు కనిపించాయి. అయితే, అతను వాటిలో ఒక పామును చంపాడు. ఆ తర్వాత.. మరో పాము అతనిపై ప్రతీకారం పెంచుకుంది. ఏకంగా ఏడునెలల్లో అతనిపై... ఏడుసార్లు కాటు వేసింది. 

Same snake bite 7 times to up farmer in rampur: సాధారణంగా పాములు పగబట్టడం మనం సినిమాల్లో చూశాం. కానీ ఈ మధ్య కాలంలో పాములు పగపట్టి మరీ.. కాటు వేస్తున్న సంఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తున్నారు. వీటి వెనుక ఏదో ఒక సందర్భంలో పాములపై దాడి చేయడం కానీ, లేదా వాటికి నష్టం కల్గించే పనులు చేయడం గానీ ఉంటున్నాయి. సాధారణంగా పాములు అడవులలో, పొలాలలో ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భలలో రైతులు, కూలీలు వారి పనులు చేసుకునేటప్పుడు అవి ప్రత్యక్ష మవుతాయి. ఈ క్రమంలో ఒక్కొసారి రైతులపైకి కాటు వేయడానికి ఎగబడతాయి. మరికొన్ని సార్లు.. రైతులు కూడా అవి తమను  ఎక్కడ కాటు వేస్తాయో.. అని వాటిని చంపేస్తారు. ఈ క్రమంలో కొన్ని సార్లు పాములు పగబడతాయంటారు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. యూపీలోని రాంపూర్ కు చెందిన ఎహసన్ అనే వ్యక్తి పొలంలో కూలీగా పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. అతనికి ఏడుగురు సంతానం. ఈ క్రమంలో మీర్జాపూర్ లో .. 7 నెలల క్రితం పొలం పనులు చేస్తుండగా అతనికి రెండు పాములు కనిపించించాయి. వెంటనే అతను ఒక పామును చంపాడు. అతనిపై మరో పాము పగ ను పెంచుకుంది. ఇప్పటి వరకు ఎహసన్ పై పాము... దాదాపు.. 7 సార్లు పాము దాడి చేసింది. అతను ఇంట్లో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు,పొలంలో పనులు చేస్తుండగా వివిధ సందర్భాలలో పాము కాటు వేసింది. కానీ అతను అన్ని సార్లు.. కూడా కాటు వేయగానే ... ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

అతను కూడా పాముని ఎన్నోసార్లు.. చంపడానికి ప్రయత్నించాడు. కానీ పాము కూడా చాకచక్యంగా తప్పించుకుంది. దీంతో కొద్ది రోజులుగా అతను తీవ్ర భయాందోళనలకు గురౌతున్నాడు. తనకు, ఏడుగురు సంతానం.. ఒకవేళ పాము కాటువేసి చంపేస్తే.. తన కుటుంబ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వింత సంఘటన చుట్టుపక్కల గ్రామాలకు పాకింది.

ఎహసన్ ను చూడటానికి చుట్టుపక్కల గ్రామం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కొంత మంది వింతగా స్పందిస్తున్నారు. అసలు పాములు..పగ పట్టలేదు.. అంటూ కొట్టి పారేస్తున్నారు. మరికొందరు మాత్రం.. కళ్లముందే యదార్థ సంఘటన కనిపిస్తుంటే.. నమ్మక తప్పడం లేదంటు కామెంట్ లు పెడుతున్నారు.

First published:

Tags: Snake bite, Uttar pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు