సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాక్షి-ధోనీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్

Sakshi-Dhoni Photos : మన క్రికెట్ వీరుల్లో ధోనీ-సాక్షీసింగ్ జంట ప్రత్యేకం. అతనేమో మిస్టర్ కూల్. ఆమె స్వీటీ. వాళ్లిద్దర్నీ అలా చూస్తుంటే... ఎంతో ముచ్చటేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ తెగ మెచ్చేసుకుంటున్నారు.


Updated: February 3, 2020, 2:49 PM IST
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాక్షి-ధోనీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాక్షి-ధోనీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ (credit - insta - sakshisingh_r)
  • Share this:
Sakshi-Dhoni Photos : "స్వీట్ స్వీటీస్" ఇదీ... ఇండియాలో పాప్ సాంగ్స్‌తో దుమ్మురేపే సోఫీ చౌదరి... క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన సతీమణి సాక్షీ సింగ్ ధోనీ జంటకు ఇచ్చిన క్యూట్ పెట్ నేమ్. ఆమె అలా అనడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే... ఈ జంట లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఫొటోల్లో అదరగొడుతున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌కి అచ్చుకుద్దినట్లు ఉన్నారంటూ ఫ్యాన్స్ వాళ్లను చూసి పండగ చేసుకుంటున్నారు. ధోనీ కంటే... సాక్షి సింగ్ సోషల్ మీడియాలో కాస్త ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఫాలోయర్లతో పంచుకుంటుంది. ఇటీవల ఈ జంట మధ్యప్రదేశ్‌లోని కన్హా టైగర్ రిజర్వ్‌‌కి వెళ్లింది. అందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా షేర్ చేసింది సాక్షి. ఈ ఫొటోలకు మెమరీస్ అని కాప్షన్ పెట్టింది. అవి భలే ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. అందుకే సోఫీ చౌదరి ఆ ఫొటోలను చూసి ఖుషీ అయ్యారు.
 View this post on Instagram
 

Memories !


A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

ఇటీవల ధోనీ... తన భార్యను ట్రోల్ చేశాడు. కెమెరా అంటే సిగ్గు పడే ధోనీ... ఓ హోటల్‌లో ట్రాక్ పాంట్స్ వేసుకోవడంతో... ఆ స్టిల్స్‌ని ఫొటో తియ్యడానికి సాక్షి ట్రై చేసింది. దాంతో తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ధోనీ ఆమెను ట్రోల్ చేశాడు. ఆ ఫొటోను షేర్ చేసిన సాక్షి... నేను నీలో భాగమే అని కామెంట్ చేసింది. అలా ఆమె చేసిన కామెంట్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. అద్భుతమైన జంట అని మెచ్చుకున్నారు.


"నీ ఫాలోయర్లను పెంచుకోవడానికే... నా ఫొటోలను నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నావు" అని ధోనీ ఆమెను టీజ్ చేశాడు. దానికి రిప్లై ఇచ్చిన సాక్షీ... "వాళ్లు ఎప్పుడూ నిన్ను చూడాలనుకుంటారు. మహీ ఎక్కడ అని అడుగుతారు" అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చింది. 
View this post on Instagram
 

❤️


A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

ఇంటర్నేషనల్ క్రికెట్‌కి దూరమయ్యాక ధోనీ... తన టైమ్‌ని చక్కగా వాడుకుంటున్నాడు. అంతకు ముందు భారత సైనికులతో చేరి విధులు నిర్వహించాడు. 2019లో టీమిండియా సెమీ ఫైనల్స్‌ దాకా వెళ్లి వెనుదిరిగాక... ధోనీ... ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు. ఈ నెలలో BCCI ప్రకటించిన వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్స్‌ లిస్టులో ధోనీ పేరు లేదు. 
View this post on Instagram
 

Wildlife at its best !


A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో లిమిటెడ్ ఓవర్స్ రిసీస్ నుంచీ మిస్సింగ్ అయ్యాక ధోనీ... జమ్మూకాశ్మీర్‌లోని పారా మిలిటరీ ఆర్మీతో చేరి రెండు వారాలు విధులు నిర్వహించాడు. ఇండియాలో జరిగిన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లను కూడా ధోనీ మిస్సయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ధోనీ పేరును ప్రకటించలేదు. 
View this post on Instagram
 

#fetch


A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on
 
View this post on Instagram
 

Holiday mode ! ❄️


A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on
First published: February 3, 2020, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading