Republic Teaser: రూలర్స్ కింద అందరూ బానిసల్లానే బతుకుతున్నారు!
Republic Teaser: సాయి ధరమ్ తేజ్.. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. హిట్, ప్లాప్ అని తేడా లేకుండా విభిన్నమైన కథలతో విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా వెనుక సినిమా తీస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాడు.
Republic Teaser: సాయి ధరమ్ తేజ్.. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. హిట్, ప్లాప్ అని తేడా లేకుండా విభిన్నమైన కథలతో విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా వెనుక సినిమా తీస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాడు.
Republic Teaser: సాయి ధరమ్ తేజ్.. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. హిట్, ప్లాప్ అని తేడా లేకుండా విభిన్నమైన కథలతో విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమా వెనుక సినిమా తీస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ అలరించిన ఈ హీరో ప్రస్తుతం రి పబ్లిక్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ రామ్ చరణ్ విడుదల చేయగా రెండు రోజుల క్రితం రిపబ్లిక్లో పవర్ఫుల్ పాత్ర చేస్తున్న రమ్య కృష్ణ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్థానం ఫెమ్ దేవా కట్టా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈరోజు 11:45 నిమిషాలకు రిలీజ్ అయ్యింది.
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం అంటూ ప్రారంభం అయ్యే ఈ టీజర్ లో రాజకీయనాయకుల కిందే ప్రజలు, సివిల్ సర్వెంట్స్, కోర్టులు కూడా బతుకుతున్నాయని.. రూలర్స్ కింద బానిసల్లా బతుకుతున్నారని సాయి ధరమ్ తేజ్ చాలా పవర్ ఫుల్‌గా డైలాగ్‌ను చెప్పే ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మీరు చుడండి.
రిపబ్లిక్ సినిమాలోలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తన్నారు. మణిశర్మ సంగీతం అందించగా జేబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.