హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఆడు మగాడ్రా బుజ్జీ : చీతాతోనే సెల్ఫీ తీసుకున్నాడు..వైరల్ వీడియో

ఆడు మగాడ్రా బుజ్జీ : చీతాతోనే సెల్ఫీ తీసుకున్నాడు..వైరల్ వీడియో

చీతాతో సెల్ఫీ

చీతాతో సెల్ఫీ

Selfie with cheetah : సోషల్ మీడియా(Social Media)లో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో చాలా మంది వ్యక్తులు భిన్నమైన కంటెంట్‌ను పోస్ట్ చేయాలనే తపనతో ప్రాణాలకు తెగించడానికి కూడా వెనుకాడరు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Selfie with cheetah : సోషల్ మీడియా(Social Media)లో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో చాలా మంది వ్యక్తులు భిన్నమైన కంటెంట్‌ను పోస్ట్ చేయాలనే తపనతో ప్రాణాలకు తెగించడానికి కూడా వెనుకాడరు. అడవి జంతువులు ఎదురుగా ఉన్నప్పుడు ఫొటోలు,వీడియోలు తీయాలనుకున్నప్పుడు ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. జంగిల్ సఫారీ రైడ్‌లో ప్రకృతిని చాలా దగ్గరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అడవి జంతువులను దగ్గరగా చూడవచ్చు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో, ఒక చీతా(Cheetah) వచ్చి సఫారీ జీప్‌(Safari Jeep)పై కూర్చొని ఉండగా ఒక వ్యక్తి చీతాతో సెల్ఫీ తీసుకుంటున్నట్లు చూడవచ్చు.

సఫారీ జీప్ పై కూర్చున్న చీతా

ఈ వైరల్ వీడియోలో... ఫారెస్ట్ లో సఫారీ జీప్ పార్క్ చేయబడింది. ఓ చీతా.. పర్యాటకులతో నిండిన సఫారీ జీపు వైపు కదులుతోంది.అకస్మాత్తుగా చీతా ఒక్కసారిగా దూకి జీప్ పైకప్పుపై కూర్చుంది. ఈ సమయంలో చిరుత కూడా తెరిచిన పైకప్పు నుండి లోపలికి చూడడానికి ప్రయత్నిస్తుంది. తరువాత సర్దుకుని ఒక వైపు కూర్చుంటుంది. ఇంతలో జీప్‌లో కూర్చున్న పర్యాటకులందరూ భయపడతుండగా, కానీ సఫారీ గైడ్‌లలో ఒకరు తన సీటు నుండి లేచి చిరుతతో సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు.

Pushpa : పుష్పగా మారి..భర్త ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి!

ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి క్లెమెంట్ బెన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను వేల సంఖ్యలో లైక్ లు,వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియో చూసిన పబ్లిక్ - ఈ వ్యక్తి బతికే ఉన్నాడా లేక పోయాడా అని అడిగారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Safari, Viral Video

ఉత్తమ కథలు