హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇదేందయ్యా ఇది : పోర్చుగల్ వెళ్లడానికి విమానమెక్కారు..దిగింది మాత్రం స్పెయిన్ లో

ఇదేందయ్యా ఇది : పోర్చుగల్ వెళ్లడానికి విమానమెక్కారు..దిగింది మాత్రం స్పెయిన్ లో

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విమానం పోర్చుగల్‌(Portugal)కు వెళ్లాల్సి ఉంది, అయితే అది స్పెయిన్‌(Spain)కు చేరుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Flight to Portugal lands in Spain instead : యూరప్‌(Europe)లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విమానం పోర్చుగల్‌(Portugal)కు వెళ్లాల్సి ఉంది, అయితే అది స్పెయిన్‌(Spain)కు చేరుకుంది. తర్వాత అతి కష్టం మీద బస్సులో ప్రయాణికులను పోర్చుగల్ పంపించారు. ఇదంతా విన్న తర్వాత మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. ఈ మొత్తం ఘటనను విమానంలోని ప్రయాణికుడు తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పంచుకున్నాడు.

అసలేం జరిగింది

శుక్రవారం ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నుంచి పోర్చుగల్‌లోని ఫారోకి వెళ్లిందేకు ర్యాన్ ఎయిర్‌(Ryanair) విమానం బయల్దేరింది. విమానంలో 157మంది ఉన్నారు. విమానం షెడ్యూల్ ప్రకారం పోర్చుగల్ లో ల్యాండ్ అవ్వాల్సి ఉన్నప్పటికీ అది స్పెయిన్ లోని మలాగా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. పోర్చుగల్ వెళ్దామని విమానమెక్కిన ప్రయాణికులు తాము దిగింది స్పెయిన్ లో అని తెలుసుకొని బిత్తరపోయారు. ఇదేంటని విమాన సిబ్బందిని నిలదీశారు. ఆ తర్వాత ర్యాన్ ఎయిర్‌ సంస్థ ఓ బస్సుని ఏర్పాటు చేసి అందులో 157మందిని రోడ్డు మార్గంలో పోర్చుగల్‌కు పంపించారు. అంతేకాదు వీరందరినీ బోర్డర్ దగ్గర మరో బస్సులో కూర్చోబెట్టారు. రోడ్డు మార్గంలో ఐదు గంటల ప్రయాణం తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఈ విషయాన్ని సదరు విమాన ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ముస్లింలు ఎక్కువగా ఉండే ఇండోనేషియా కరెన్సీపై వినాయకుడి చిత్రం..ఎందుకో తెలుసా

విమానాన్ని ఎందుకు దారి మళ్లించారు?

ఇంత గందరగోళం ఎందుకు జరిగిందనే దానిపై విమానయాన సంస్థ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది. ఫ్రెంచ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సమ్మె కారణంగా విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చిందని, ఇది పూర్తిగా తమ నియంత్రణలో లేదని విమానయాన సంస్థ తెలిపింది. సెప్టెంబర్ 16న జరిగిన ఈ సమ్మె కారణంగా చాలా విమానాలను ఇతర నగరాలకు మళ్లించాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే విమానం దారి మళ్లింపు గురించి తమకు అసలు కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదని ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Flight, Spain

ఉత్తమ కథలు