• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • RUSSIAN WOMAN MARINA BALMASHEVA GIVES BIRTH TO BABY GIRL WITH HER 21 YEAR OLD STEPSON SU

భర్తను కాదని కొడుకును పెళ్లాడిన మహిళ.. ఇప్పుడు అతనితోనే బిడ్డను కూడా కనేసింది..

భర్తను కాదని కొడుకును పెళ్లాడిన మహిళ.. ఇప్పుడు అతనితోనే బిడ్డను కూడా కనేసింది..

(Image- Instagram/marina_balmasheva)

ఓ మహిళ భర్తకు విడాకుల్చి కొడుకును పెళ్లిచేసుకుంది. ఇప్పుడు అతనితో కలిసి జీవిస్తున్న.. బిడ్డకు జన్మనిచ్చింది.

  • Share this:
    ఓ మహిళ భర్తకు విడాకుల్చి కొడుకును పెళ్లిచేసుకుంది. ఇప్పుడు అతనితో కలిసి జీవిస్తున్న.. బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాలు.. భారీగా బరువు తగ్గి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న క్రాస్నాదర్ క్రాయికి చెందిన 35 ఏళ్ల మరీనా బల్మాషేవా అనే మహిళ 45 ఏళ్ల వయసు కలిగిన అలెక్సీ షావిరిన్‌ను పదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. అయితే షావిరిన్‌ను అప్పటికే 10 ఏళ్ల కొడుకు(వ్లాడిమిర్) ఉన్నాడు. మరీనా కూడా అతన్ని చాలా ప్రేమగా చూసుకునేంది.పదేళ్ల కాపురం తరువాత మరియాకు తన భర్తతో వ్యక్తిగత మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో మరీనా భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది. అయితే వ్లాడిమిర్ మాత్రం మరీనాను విడిచి ఉండలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే తరుచూ మరీనా ఇంటికి వెళ్లి కలిసివచ్చేవాడు. ఈ క్రమంలోనే వారి మధ్య చనువు బాగా పెరిగింది.

    అయితే కొన్ని రోజులుకు తనకు వ్లాడిమిర్ మీద ఉంది తల్లి-కొడుకుల మధ్య ఉండే ప్రేమ కాదని మరీనా గుర్తించింది. ఈ విషయాన్ని వ్లాడిమిర్‌కు చెప్పింది. అతని మనసులో కూడా అదే ఆలోచన ఉండటంతో.. వారిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. గతేడాది ప్రారంభంలోనే పెళ్లి చేసేసుకుందామ‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ క‌రోనా పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి వాయిదా పడింది. అయితే గతేడాది జూలైలో వారు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది మరీనా తీరును తప్పుబడుతూ కామెంట్లు చేశారు. వీరిద్దరి బంధంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

    తన నుంచి విడాకులు తీసుకున్న మహిళను.. తన కొడుకే పెళ్లి చేసుకోవడంతో షావిరిన్ పరిస్థితి దారుణంగా తయ్యారయింది. తొలుత ఈ పెండ్లికి అతను అంగీకరించలేదు. అయితే ఆ తర్వాత చేసేదేమి లేక అయిష్టంతోనే అంగీకరించాల్సి వచ్చింది.

    అయితే తాజాగా కొడుకుతో కలిసి మరీనా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. చిన్నారితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే బిడ్డ జన్మించిన సమయంలో మాత్రం వ్లాడిమిర్ అక్కడ లేనట్టుగా తెలుస్తోంది. ఇక, మరీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5.35 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు