హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking: రష్యన్ సైనికులకు వారి భార్యల పర్మిషన్.. వారిని అత్యాచారం చేసుకొవచ్చు.. కానీ...

Shocking: రష్యన్ సైనికులకు వారి భార్యల పర్మిషన్.. వారిని అత్యాచారం చేసుకొవచ్చు.. కానీ...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Russia Ukraine War: రష్యాసైన్యం, ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్ నగరం తన రూపు రేఖలను కోల్పోయింది. అక్కడి మహిళలు, యువతులపై రష్యాసైన్యం అఘాయిత్యాలకు తెగబడుతుంది.

Russia Ukraine War: నెల రోజులకు పైగా రష్యా, ఉక్రెయిన్ పై మారణ హోమం కొనసాగిస్తుంది. ఎక్కడ చూసిన కుప్పలుగా తెప్పలుగా శవాలు, శిథిలాలుగా మారిన భవనాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ (Ukraine war) నుంచి లక్షల మంది సామాన్య ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కొన్ని చోట్ల వలస వెళ్లిన దేశాలలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు పాల్పడిన అనేక సంఘటలను వెలుగులోనికి వచ్చాయి. కొన్ని చోట్ల కేవలం యువతులకే ఆశ్రయం ఇచ్చారు. అదును చూసి వారిపై అత్యాచారం చేసిన సంఘటనలు కొకొల్లలు.

ఇక ఉక్రెయిన్ లోను.. రష్యన్ సైనికులు అనేక మంది మహిళలను అత్యాచారం చేసిన సంఘటనలు వెలుగులోనికి వచ్చాయి. కీవ్, మేరియుపోల్, తదితర నగరాలలో అమాయకుల ఇళ్లను టార్గెట్ గా చేసుకుని సైనికులు దాడులకు పాల్పడుతున్నారు. రష్యన్ సైనికులు ఉక్రెయిన్ లోని ఒక ఇంట్లో ప్రవేశించి, ఆమె బాలుడిని పక్క గదిలో పెట్టి ఆమెపై అత్యాచారం (Molest on Ukraine woman) చేశారు. ఈ ఘటన అప్పట్లో వార్తలలో నిలిచింది.  తాజాగా, ఉక్రెయిన్ సెక్యురిటీ సర్వీసెస్ (Ukraine Security Services) రష్యన్ సైనికులు తమ భార్యలతో మాట్లాడిన కాల్స్ ను ట్రాప్ చేసింది. దానిలో ఒక జంట మాట్లాడుకున్న కాల్స్ రికార్డు (Call Record)  ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

' isDesktop="true" id="1268758" youtubeid="MF4TcWk9GpE" category="international">

పూర్తి వివరాలు.. ఒక రష్య సైనికులు తన భార్య కు కాల్ చేశాడు. ఆ తర్వాత వారు మాట్లాడుకుంటూ.. నిన్ను చాలా మిస్ అవుతున్నానని  తన భార్యతో చెబుతాడు.. దీనికి ఆమె నవ్వి.. అక్కడ ఉక్రెయిన్ మహిళలు అందంగా ఉంటారు కదా అని అంటుంది. నాకు తెలుసు.. కావాలంటే.. నువ్వు వారిని అత్యాచారం చేసుకో.. కానీ ఆ విషయం నాకు మాత్రం చెప్పోద్దని నవ్వుతు అంటుంది. దీనికి సమాధానంగా.. సైనికుడు.. నీకు ఉక్రెయిన్ మహిళలను అత్యాచారం చేసింది చెప్పొందంటావు అంతే  కదా..  అని రిప్లై ఇస్తాడు. దీనికి ఆమె నవ్వుతూ.. సరే.. యువతులను అత్యాచారం (Give Permission to abuse Ukraine woman) చేసుకుండి. కానీ కండోమ్ ధరించి చేయండి అని జాగ్రత్తలు చెబుతుంది. కానీ మీరు..  అత్యాచారం చేసింది మాత్రం నాకు చెప్పొద్దు అంటూ మళ్లి నవ్వుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు