హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అనూహ్య పరిణామం.. సొంత యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేస్తున్న రష్యన్ సైనికులు.. కారణం ఏంటంటే..

అనూహ్య పరిణామం.. సొంత యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేస్తున్న రష్యన్ సైనికులు.. కారణం ఏంటంటే..

రష్యన్ యుద్ద ట్యాంకులు

రష్యన్ యుద్ద ట్యాంకులు

Russian-Ukraine War: రష్యా,ఉక్రెయిన్ లో విధ్వంసం సష్టిస్తోంది. వరుసగా ఎనిమిదో రోజు కూడా రష్యన్ దళాలు మూకుమ్మడిగా ఉక్రెయిన్ పైన దాడిచేస్తున్నాయి. ప్రపంచ దేశాలు పుతిన్(Vladimir Putin) దురహంకారాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఉక్రెయిన్ లో కొన్ని రష్యా దళాలు.. తమ యుద్ధవాహానాలను తామే ధ్వంసం చేస్తున్నారు. న్యూయార్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...

Russian-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ లో విధ్వంసం సష్టిస్తోంది. వరుసగా ఎనిమిదో రోజు కూడా రష్యా దళాలు మూకుమ్మడిగా ఉక్రెయిన్ పైన దాడిచేస్తున్నాయి. ప్రపంచ దేశాలు, నాటో కూటమి. పుతిన్(Vladimir Putin) దురహంకారాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో సహ పలుదేశాలు, ఉక్రెయిన్ (Ukraine) కు బాసటగా నిలుస్తున్నాయి. ఇటు స్వదేశంలోను పుతిన్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ఉక్రెయిన్ లో కొన్ని రష్యా దళాలు.. తమ యుద్ధవాహానాలను తామే ధ్వంసంచేస్తున్నారు. న్యూయార్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రష్యా సైనికులు గత ఎనిమిది రోజుల నుంచి ఉక్రెయిన్ పై (Russia-Ukraine War) ముప్పేట దాడికి పాల్పడుతున్నాయి. ఇరు దేశాలలోను భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని తెలుస్తోంది.

ఇప్పటికే ప్రపంచ దేశాలు, నాటో కూటమి (Nato) పుతిన్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా పుతిన్ ను అన్ని విధాల అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు.. రష్యా విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా రష్యా కు చెందిన బ్యాంకులపై అంతర్జాతీయంగా నిషేధం విధించారు.

రష్యాపై అనేక ఆర్థిక పరమైన ఆంక్షలు (Economic Crisis) కొనసాగిస్తున్నారు. పలు దేశాలు సాంకేతిక సేవలను నిలిపివేశాయి. ప్రస్తుతం.. రష్యా కరెన్సీ రూబుల్, షేర్ మార్కెట్లు కూడా భారీగా పతన మయ్యాయి.

పుతిన్ నియంతృత్వ వైఖరీనికి వ్యతిరేకంగా సొంత దేశంలో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మాస్కోలో కూడా ప్రజలు భారీగా నిరసనలలు తెలుపుతున్నాయి. ఈ తరుణంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ( The New York Times) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఉక్రెయిన్ దురాక్రమణకు మోహరించిన రష్యాసైనికులు తమ యుద్ధవాహనాలను ధ్వంసం చేస్తున్నారు. వీరంతా అమాయకులపై కాల్పులు జరపలేక కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపింది. చిన్న పిల్లలపై, అమాయకులపై కాల్పులు జరపలేక ఈ విధంగా చేస్తున్నారని తెలిపింది.

ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెంస్కీ (Volodymyr Zelenskyy) తమ దేశప్రజలకు స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొనాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. దీంతో వేలాదిక ఉక్రెయిన్ సామాన్య ప్రజలు మిషన్ గన్ పట్టుకుని తమ దేశం కోసం యుద్ధంలో పాల్గొంటున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు మాతృ భూమి తరపున యుధ్దం కోసం కదన రంగంలోకి దూకారు. తమ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైన సిద్ధపడ్డారు.

మరికొన్ని చోట్ల రష్యన్ సైనికులకు సరిపడా ఆహరం, యుద్ధ ట్యాంకులలో సరిపడా ఇంధనం లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో వారు తమ యుద్ధ ట్యాంకులను నాశనం చేస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పలు వివరాలను వెల్లడించింది. అదే విధంగా మరికొన్ని చోట్ల కమాండర్ల ఆదేశాలను సైతం.. సైనికులు ధిక్కరిస్తున్నట్లు డైలీమెయిల్ లో కూడా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇప్పటికైన పుతిన్ తన యుద్ధోన్మాదాన్ని విడిచిపెట్టి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పలు దేశాలు సూచిస్తున్నాయి.

First published:

Tags: America, Russia, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు