Home /News /trending /

RUSSIAN PRESIDENT VLADIMIR PUTIN SURVIVED ASSASSINATION ATTEMPT 2 MONTHS AGO PAH

Russia: పుతిన్‌పై రెండునెలల క్రితమే హత్యాయత్నం .. ఉక్రెయిన్ సైనికాధికారి కీలక వ్యాఖ్యలు..

వ్లాదిమిర్ పుతిన్ (ఫైల్)

వ్లాదిమిర్ పుతిన్ (ఫైల్)

Vladimir putin: ఉక్రెయిన్ సైనికాధికారి జనరల్ కైరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ పై రెండు నెలల క్రితమే హత్యయత్నం జరిగిందని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

కొన్ని నెలలుగా రష్య సైనికులు (Russia) ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన నగరాలు పుతిన్ సేనల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్ లోని భవనాలు (Ukraine) పూర్తిగా శిథిలాలుగా మారిపోయాయి. ఎక్కడ చూసిన శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. రష్య సైనికులు అమాయకులపై తమ మారణ హోమాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి భయపడి లక్షల మంది తమ దేశం విడిచి వలస పోతున్నారు. ఇక ప్రపంచ దేశాలు రష్యా చర్యలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. రష్యపై కఠిన ఆంక్షలను కొనసాగిస్తున్నాయి.

అయినప్పటికి పుతిన్ (vladimir putin) తన యుద్ధోన్మాదాన్ని మాత్రం ఆపడం లేదు. కాగా, ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైరిలో బుడనోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిపై రెండు నెలల క్రితమే హత్యయత్నం జరిగిందని అన్నారు. కాకపస్ ప్రాంతానికి చెందిన కొంత మంది పుతిన్ ను చంపడానికి విఫలయత్నం చేశారని అన్నారు. భద్రత దళాల అప్రమత్తతతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారని ఉక్రెయిన్ సైనికాధికారి బుడనోవ్ తెలిపారు.

కాకపస్ అనేది నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం మధ్యలో ఉండే ప్రాంతం. ఈ ఘటన ఫిబ్రవరి 24 తర్వాత కొన్ని రోజులకు జరిగిందని ఆయన అన్నారు. ఇప్పటికే పుతిన్ ఆరోగ్యంపై భిన్న రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల నుంచి ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నరని కూడా వార్తలు వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా గతంలో పుతిన్   అనారోగ్యంగా ఉన్నారని పలు పుకార్లు షికార్లు చేశాయి.

Putin Health Condition : భారత్ కు దశాబ్దాలుగా మిత్రదేశంగా ఉన్న రష్యా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల విమర్శలు అందుకుంటోంది. కారణం ఆ దేశపు పొరుగుదేశం ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడమే. దాదాపు మూడు నెలల నుంచి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. యుద్దం నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చనీయాంశంగా మారారు. నిన్నటి వరకూ యుద్ధం కారణంగా చర్చనీయాంశమైతే..ఇప్పుడతని గురించి మరో కీలకమైన అప్‌డేట్ వెలువడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని సమాచారం.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని, రక్త కేన్సర్‌తో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని బ్రిటన్‌ మాజీ గూఢచారి క్రిస్టఫర్‌ స్టీల్‌ వెల్లడించారు. యూఎస్ కు చెందిన ఓ మేగజీన్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని క్రిస్టోఫర్ వెల్లడించారు. "కచ్చితంగా ఆయన అనారోగ్య సమస్య ఏమిటనేది తెలియదు. అది నయమయ్యేదేనా, కాదా అనేదీ తెలియదు. కానీ యుద్ధ సమీకరణాల్లో అదీ ఒక భాగమే. రష్యా నుంచి, ఇతర చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం పుతిన్‌ చాలా తీవ్ర అస్వస్థతతో ఉన్నారు" అని చెప్పారు. వాస్తవానికి ఉక్రెయిన్‌పై యుద్దానికి ముందు నుంచే వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం బాగాలేదని తెలుస్తోంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Russia-Ukraine War, Vladimir Putin

తదుపరి వార్తలు