ప్రయాణికుల కాలర్ పట్టి.. విమానంలోంచి బయటికి లాగేసిన ఎయిర్‌హోస్టెస్

Russian Plane Crash: ఆ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో ఎయిర్‌పోర్టు నుంచి ఆర్కిటిక్ వలయం సమీపంలోని ముర్మాన్స్క్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, మంటల కారణంగా ఆ విమానాన్ని పైలట్ అత్యవసరంగా కిందికి దించేశాడు.

news18-telugu
Updated: May 7, 2019, 1:15 PM IST
ప్రయాణికుల కాలర్ పట్టి.. విమానంలోంచి బయటికి లాగేసిన ఎయిర్‌హోస్టెస్
రష్యాలో విమాన ప్రమాదం దృశ్యాలు
  • Share this:
రష్యాలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతూ మంటల్లో చిక్కుకుని దగ్ధం కావడంతో ఇద్దరు చిన్నారులు సహా 41 మంది ప్రయాణీకులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏరోఫ్లోట్ విమానయాన సంస్థకు చెందిన సుఖోయ్ సూపర్ జెట్-100 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే అగ్నికీలల్లో చిక్కుకుంది. ఆ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో ఎయిర్‌పోర్టు నుంచి ఆర్కిటిక్ వలయం సమీపంలోని ముర్మాన్స్క్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, మంటల కారణంగా ఆ విమానాన్ని పైలట్ అత్యవసరంగా కిందికి దించేశాడు. ఈ క్రమంలోనే 41 మంది మంటల్లో బూడిదయ్యారు. ఘటనకు పిడుగే కారణమై ఉండొచ్చని అధికారులు తెలిపారు.

అయితే, 37 మంది ప్రాణాలతో బయటపడ్డారంటే కసట్కినా ఓ ఎయిర్ హోస్టెస్ చేసిన సాహసమే కారణం. ఓ వైపు భగభగ మంటలు చుట్టుముడుతున్నా ప్రయాణికులను కాపాడాలని తాను ప్రాణాలకు తెగించింది. రన్‌వేపై విమానాన్ని దించగానే ప్రయాణికులను ఒక్కొక్కరిని కాలర్ బట్టి బయటకు లాగేసింది. మంటలు క్యాబిన్‌లోకి చేరుకోకముందే ప్రయాణికులందర్నీ బయటికి దించేసింది. దీంతో ఆమె సాహసాన్ని ప్రయాణికులు సహా సిబ్బంది కొనియాడారు.

First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...