RUSSIAN PILOT OFFERS EXTRA FLYING TIME TO STUDENT IN EXCHANGE FOR ROMANCE BOTH FIRED OVER LEAKED VIDEO PVN
Leaked Video : కాక్ పిట్ లో కామకేళి..ఎక్కువ సేపు శిక్షణ ఆశ చూపి ట్రైనీ పైలట్ తో శృంగారం
కాక్ పిట్ లో ట్రైనీ-పైలట్ రొమాన్స్
Pilot and Student Romance: ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్ విమానం గాల్లోనే ఉండగానే ఆమెతో శృంగారం జరిపాడు. విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయాడు.
Pilot and Student Romance: ట్రైనీ పైలట్(Traine Pilot)కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్ విమానం గాల్లోనే ఉండగానే ఆమెతో శృంగారం జరిపాడు. విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయాడు..రష్యాలో ఈ సంఘటన వెలుగు చూసింది. రష్యా(Russia)లోని సాసోవో ఫ్లైట్ స్కూల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో 8 ఏండ్ల పైలట్ కొందరు ట్రైనీలకు శిక్షణ ఇస్తున్నాడు. రియాజాన్ ప్రాంతంలో సెస్నా 172 విమానంలో 21 ఏళ్ల మహిళా ట్రైనీకి శిక్షణ ఇస్తూ తన కోరిక తీరిస్తే మరిన్ని ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని ఆశ చూపాడు.
తొలుత ఆమె నిరాకరించినా ఆ తర్వాత అతడికి లొంగిపోయింది. దీంతో విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టాడు. ఆపై ఇద్దరూ రాసలీలలకు దిగారు. అంతేకాకుండా, మొబైల్లో తమ శృంగారం మొత్తాన్ని రికార్డు కూడా చేసుకున్నారు. కాగా, అక్కడ శిక్షణ పొందుతున్న ఒక విద్యార్థి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. ఆ ట్రైనీ పైలట్ తన తోటి కేడెట్‌తో గొడవపడింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఈ వీడియోను బయటపెట్టేసింది.
దీంతో శిక్షణ ఇచ్చే పైలట్‌తోపాటు మహిళా ట్రైనీని ఆ ఫ్లైట్ స్కూల్ తొలగించింది. ఇదే విషయమై తొలుత ఆ ట్రైనీ పైలట్ మాట్లాడుతూ.. తాము ముద్దులు, కౌగిలింతలకే పరిమితమయ్యామని చెప్పింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ అలా ఒకసారే జరిగిందని చెప్పుకొచ్చింది. ఎక్స్ట్రా క్లాసులు చెబుతానని ఆ పైలట్ హామీ ఇవ్వడంతో దానికి ఆమె ఒప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.