బికినీలో నర్సు చికిత్స.. ఎందుకో తెలుసా..?

కరోనా వైరస్‌పై పోరాటంలో డాక్టర్లది కీలక పాత్ర. అయితే, ఓ నర్సు చికిత్స అందిస్తున్న తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘హాట్’ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: May 21, 2020, 11:10 AM IST
బికినీలో నర్సు చికిత్స.. ఎందుకో తెలుసా..?
పీపీఈ సూట్, బికినీలో రష్యా నర్సు
  • Share this:
కరోనా వైరస్‌పై పోరాటంలో డాక్టర్లది కీలక పాత్ర. అయితే, ఓ నర్సు చికిత్స అందిస్తున్న తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘హాట్’ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాకే సెగలు రేపేలా ట్రెండ్ అవుతోంది ఆమెకు సంబంధించిన ఫొటో. రష్యాలోని టులా అనే పట్టణంలో ఆస్పత్రిలో ఓ మహిళ నర్సుగా పనిచేస్తోంది. అక్కడ కరోనా రోగులకు చికిత్స అందజేస్తు్న్నారు. అయితే, కరోనా వైద్యులకు సోకకుండా ఉండేందుకు పీపీఈ కిట్లను అందజేశారు. ఆమెకు కూడా ఇచ్చారు. అవి వేసుకుంటే ఉక్కపోతను భయంకరమైన ఉక్కపోత, వేడి పుడుతోందట. దీంతో ఆమె తన దుస్తులను తీసేసి, కేవలం బికినీలోనే పీపీఈ సూట్‌ను ధరించింది. ఆ సూట్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటంతో ఆమె బికినీ బయటకు కనిపిస్తోంది. ఆమె వస్త్రధారణపై ఆస్పత్రి వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే, ఆమెను చూసిన కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అంతే.. కొద్ది నిమిషాల్లోనే ఆ ఫొటో వైరల్ అయ్యింది. అలా ఆ దేశ ఆరోగ్య శాఖ చెంతకు చేరడంతో ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. విచారణలో ఆ నర్సు పీపీఈ సూట్ ధరిస్తే వేడిగా ఉంటోందని, అందుకే తాను ఇలా బికినీ వేసుకున్నానని చెప్పింది. పీపీఈ సూట్ పారదర్శకంగా ఉండటం వల్లే బయటికి కనిపిస్తోందని వివరణ ఇచ్చింది. ఆమె జవాబుకు సంతృప్తి చెందని ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు.

Published by: Shravan Kumar Bommakanti
First published: May 21, 2020, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading