• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • RUSSIAN MAN BOOKS RS 2 LAKH HELICOPTER RIDE JUST BECAUSE HE WANTED TO EAT A MCDONALDS BURGER KNOW HERE MS

Viral: బర్గర్ తినాలనిపించి.. ఏకంగా హెలికాప్టర్ నే బుక్ చేశాడు..

Viral: బర్గర్ తినాలనిపించి.. ఏకంగా హెలికాప్టర్ నే బుక్ చేశాడు..

ప్రతీకాత్మక చిత్రం

ఆకులు, అలమలు తిని తిని బోర్ కొట్టింది. చుట్టూరా తిరిగినా అంతా అదే ఫుడ్. నోటికి ఉప్పు కారం తగలడం లేదు. వయసు మీదున్న బాడీకి ఉప్పు కారం తగలకుంటే ఎలా..? పక్కన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది.

  • News18
  • Last Updated:
  • Share this:
    గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేద్దామని విహారయాత్రకు వెళ్లాడు. వెళ్లింది సిటీకి సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరం. అక్కడ తినడానికి ఏం లేదు. ఆకులు, అలమలు తిని తిని బోర్ కొట్టింది. చుట్టూరా తిరిగినా అంతా అదే ఫుడ్. నోటికి ఉప్పు కారం తగలడం లేదు. వయసు మీదున్న బాడీకి ఉప్పు కారం తగలకుంటే ఎలా..? పక్కన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. తానుంటున్న ప్రదేశంలోనేమో చిలగడదుంపలు, కందగడ్డలు. ఇక వీల్లేదనుకున్నాడు. నాలికకు మసాలా రుచి తగలాల్సిందే. ఐదు వందల కిలోమీటర్లు వెళ్లాలంటే మాటలా..? కానీ వెళ్లాడు. బర్గర్ తిన్నాడు. ఎలా..?

    అసలు విషయానికొస్తే రష్యాకు చెందిన మార్టినోవ్ విక్టర్ అనే యువకుడు.. నిండా ముప్పై ఐదేళ్లు కూడా లేవు. ఓ పెద్ద కంపెనీకి సీఈవో. మన భాషలో చెప్పాలంటే ఫుల్లు సౌండ్. విహార యాత్ర నిమిత్తం రష్యా రాజధాని మాస్కో నుంచి సుమారు 450 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక ప్రదేశానికి వెళ్లాడు. కూడా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఇంకేం.. నాలుగు రోజులుగా అక్కడే గడిపాడు. కానీ అక్కడ అంతా సేంద్రీయ ఆహారమే. ఆకులు, అలమలు తప్ప మరేం దొరకడం లేదు.

    దీంతో విసిగెత్తిపోయిన మార్టినోవ్.. మాస్కోకు ప్రయాణమ్యాడు. అక్కడికెళ్లి బర్గర్ తినాలనుకున్నాడు. నాలుగు వందల కిలోమీటర్ల దూరం అంటే కనీసం ఎంత హైస్పీడ్ కారులో వెళ్లినా.. సుమారు ఓ పదిగంటలైనా పడుతుంది. అందుకే అతడు మాస్కోకు త్వరగా వెళ్లడానికి ఒక హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడు. ఆ హెలికాప్టర్ ఖర్చు అక్షరాలా రూ. 2 లక్షలు.

    ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇదే విషయమై మార్టినోవ్ స్పందిస్తూ.. ‘నా స్నేహితురాలు నేను ఈ సేంద్రీయ ఆహారంతో విసిగిపోయాం. మాకు ఏదైనా కొంచెం స్పైసీగా తినాలనిపించింది. కానీ మేమున్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లడం అంత ఈజీ కాదని తెలిసింది. దీంతో మేము హెలికాప్టర్ బుక్ చేసుకున్నాం. అది అత్యంత ఆసక్తికర సాహసంగా నిలిచింది...’ అని చెప్పుకొచ్చాడు.
    Published by:Srinivas Munigala
    First published: