Speed Car: ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటారు. అయితే ఇలా ఆనందం పొందడంలో తప్పు లేదు గానీ.. వారి పిచ్చితో ఇతరులను ఇబ్బంది పెడితేనే అసలు సమస్య. తాజాగా ఓ రష్యన్ యువకుడు వెరైటీగా కారుపై ఓ ఫీట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఈ ప్రమాదకర ఫీట్‌ను సోషల్ మీడియాలో (Social Media) షేర్ చేశాడు. ఈ చర్య కాస్తా అతడిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ వ్యక్తి రోడ్డుపై ప్రమాదకరమైన రీతిలో విన్యాసాలు చేస్తున్న వీడియో చూసిన పోలీసులు వెంటనే అతడిపై కేసు నమోదు చేశారు. అసలు విషయానికి వెళ్తే.. రష్యాలో పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డానిల్ మయాస్నికోవ్ ఎప్పటికప్పుడు కొత్త విన్యాసాలు చేస్తుంటాడు. ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేస్తాడు. అతని వెరైటీ వీడియోలతో(Vira Video) పెద్ద ఎత్తున ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అతని ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 8 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
Viral video: పైలెట్ చేసిన అద్భుత విన్యాసానికి నెటిజన్లు ఫిదా.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న వీడియో..
అయితే డానిల్ మయాస్నికోవ్ ఈ సారి ఓ వెరైటీ ఫీట్ చేశాడు. 122 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారుపై పడుకొని ప్రమాదకర రీతిలో ప్రయాణించాడు. తాను కింద పడిపోకుండా టేప్, తాడు సహాయంతో కట్టేసుకున్నాడు. రష్యాలోని సోచి హైవే ఈ వెరైటీ స్టంట్‌కు వేదికైంది. విజయవంతంగా తన ప్రయాణం పూర్తి చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. డానిల్ ఆగస్టు 1 న తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేయగా, ఇప్పటివరకు 2.56 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది.
View this post on Instagram
సోషల్‌మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో..
వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. డానియల్ ఒక తాడు, డక్ట్ టేప్ సహాయంతో తనను తాను కారుకు ఓవైపు కట్టుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడిని స్పీడ్‌గా కారు నడపమన్నాడు. అతను 122 కిలోమీటర్ల వేగంతో కారు నడపగా ప్రమాదకర రీతిలో అలాగే ప్రయాణించాడు. అంతేకాదు, ఇలాంటి స్థితిలో కూడా ఎలాంటి భయం లేకుండా ప్రయాణించడం మనం వీడియోలో చూడవచ్చు.
అతని స్నేహితులు మరో కారులో ఫాలో అవుతూ.. డానిల్ మయాస్నికోవ్ ఫీట్‌ను వీడియో తీశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్(instagram) పేజీలో అప్లోడ్ చేయగా.. ట్రాఫిక్ భద్రతా అధికారుల కంట పడింది. వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. అయితే, ప్రమాదకరమైన విన్యాసం చేస్తూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు గాను డేనియల్‌కు జరిమానా విధించారా? లేదా? అనే దానిపై స్పష్టతనివ్వలేదు. కొందరు డానిల్ సాహసాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయవద్దంటూ సలహాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news, Viral post, Viral Videos