Home /News /trending /

RUSSIAN GROOM AND UKRAINE BRIDE MARRIED IN INDIA AMID TENSION BETWEEN TWO COUNTRIES AK

Trending Marriage: ఉక్రెయిన్ అమ్మాయి...రష్యా అబ్బాయి.. ఇండియాలో పెళ్లి.. ప్రేమంటే ఇదేరా..

ఉక్రెయిన్ అమ్మాయిని పెళ్లాడిన రష్యా అబ్బాయి (Credit- Twitter/@BeingHimachali )

ఉక్రెయిన్ అమ్మాయిని పెళ్లాడిన రష్యా అబ్బాయి (Credit- Twitter/@BeingHimachali )

Trending Marriage: వాస్తవానికి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తరువాత పెళ్లి చేసుకోవాలని ఈ జంట మొదట భావించింది. ఇందుకోసం కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ప్రేమపై ఎవరికీ ఎటువంటి శక్తి లేదని అంటారు. ఒక వ్యక్తి హృదయం ఎవరిపైనైనా పడితే, ఆ వ్యక్తి నేపథ్యం లేదా అతను ఎక్కడ నివసిస్తున్నాడు అనేది పట్టింపు లేదు. ప్రపంచంలోని రెండు శత్రు దేశాలలో నివసిస్తున్న ప్రజల మధ్య ఇలాంటిదే జరిగింది. వారు యుద్ధం, ద్వేషం లేదా శత్రుత్వం విడిచిపెట్టి తమ ప్రేమను చివరి వరకు కొనసాగించారు. ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఎంత యుద్ధం జరుగుతున్నా ప్రేమించే వారికి పట్టదు. ఒక రష్యన్ వరుడు ధర్మశాలలో తన ఉక్రేనియన్ వధువును వివాహం చేసుకున్నాడు. రష్యా, ఉక్రెయిన్ (Russia Ukraine) మధ్య గత 6 నెలలుగా యుద్ధం జరుగుతున్నా.. ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఈ జంట పెళ్లి (Marriage)  చేసుకోవడం ద్వారా ఏ పరిస్థితిలోనైనా ప్రేమ బలంగా ఉందని రుజువు చేసింది.

    హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల నగరంలోని ఖరోటా దివ్య ఆశ్రమం వద్ద ఈ జంట పెళ్లి చేసుకుంది. వరుడి పేరు సెర్గీ నోవికోవ్. అతను రష్యాకు చెందినవాడు, వధువు అలియోనా బ్రమోకా ఉక్రెయిన్ నుండి వచ్చింది. వారు భారతదేశానికి వచ్చి ధర్మశాల సంప్రదాయ పాటల మధ్య ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. హిందూ ఆచారాల ప్రకారం ఏడు ప్రదక్షిణలు చేసి ఒకరికొకరు అండగా ఉంటామని ప్రమాణం చేశారు. వారి వివాహానికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @BeingHimachali అనే ఖాతాతో పంచుకున్నారు.



    వీరిద్దరూ ఇద్దరూ భారతీయ దుస్తులలో కనిపిస్తారు. వధువు ఎరుపు రంగు జంటను ధరించగా, వరుడు సెర్గీ షేర్వాణీని ధరించాడు. పండితుడు చెప్పే మంత్రాలను కూడా ఒక అనువాదకుడు అనువదించి, ఆ దంపతులకు చెప్పాడు. ఈ జంట ధరమ్‌కోట్‌లో నివసిస్తున్నప్పుడు గత 2 సంవత్సరాలుగా ఒకరితో ఒకరు డేటింగ్‌లో ఉన్నారు. అప్పట్లో ఇరు దేశాల మధ్య పరిస్థితులు బాగానే ఉన్నా.. ఇప్పుడు పరిస్థితి సీరియస్‌గా మారినా ఈ జంట ప్రేమపై ఎలాంటి ప్రభావం పడలేదు.

    Beer Tester: ఎన్ని బీర్లు కావాలంటే అన్ని తాగొచ్చు.. అదే మీ ఉద్యోగం.. అసలు విషయం ఏమిటంటే..

    ‘యముడు లంచ్ బ్రేక్ లో ఉన్నాడేమో..’.. రెప్పపాటులో షాకింగ్ ఘటన.. వైరల్ గా మారిన వీడియో..

    వాస్తవానికి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తరువాత పెళ్లి చేసుకోవాలని ఈ జంట మొదట భావించింది. ఇందుకోసం కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తోంది. కానీ ఇప్పుడప్పుడే అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. పైగా పరిస్థితులు చేయిదాటితే.. తమ పెళ్లికి ఆటంకాలు ఎదురుకావొచ్చని ఈ జంట భావించింది. అందుకే భారత్ వచ్చి ఇక్కడ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Trending news, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు