విదేశాలలో ప్రేమికులు చాలా ఫాస్ట్. వాళ్లు అక్కడ రోడ్డు మీదనే ముద్దులు, హగ్గులు, వీలైతే ఆ పని కూడా కానిచ్చేస్తారు. అక్కడ వాళ్లకు ఆ స్వేచ్ఛ ఉంది. అందుకే ఇందుకు సంబంధించిన వీడియోలు మనలాంటి దేశాలలో వైరల్ అవుతుంటాయి. తాజాగా.. రష్యాలో పలు జంటలు మెట్రో రైలులో పోటీలు పడి ముద్దులు పెట్టుకున్నాయి. జంటలంటే ఒకటో.. రెండో కాదు.. పదుల సంఖ్యలో ఉన్నాయి. వీళ్లంతా తమ లవర్లతో మెట్రో రైలు ఎక్కి.. ముద్దుల్లో మునిగిపోయారు. ఒకరిని మించి ఒకరు లిప్ లాక్ లతో ముంచెత్తారు. ఇంతకీ వీరేదో ఆనందానికో.. రికార్డు కోసమో ఇలా చేస్తున్నారంటే మీరు కూడా ముద్దపప్పులో కాలేసినట్టే. వాళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముద్దులతో నిరసన. ఎందుకనుకుంటున్నారా..?
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్ కూడా జనాల్ని భయకంపితుల్ని చేస్తున్నది. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే దీని వ్యాప్తికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఈ నేపథ్యంలో.. చలి దేశమైన రష్యాలో కూడా దీని విజృంభణ ఎక్కువగానే ఉన్నది. అయితే ఇతర దేశాల మాదిరిగానే.. రష్యా కూడా కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి కొన్ని నిబంధనలు విధించింది. ఈ నిబంధనలే ఇప్పుడక్కడి యువతకు నచ్చడం లేదు.
రష్యాలో ప్రభుత్వం విధించిన నిబంధనలపై నిరసన వ్యక్తం చేస్తూ.. పలువురు తమ నిరసనను వినూత్నంగా ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ నిరసన ద్వారా కూడా వారికి కోవిడ్ వచ్చే ప్రమాదమే అధికంగా ఉండటం గమనార్హం. రష్యాలో మెట్రో రైళ్లు ఎక్కిన పలు జంటలు.. తాము రూల్స్ ను పాటించమని.. వాటిని బ్రేక్ చేస్తామని కరాకండిగా చెప్పేశాయి. అందుకనుగుణంగానే.. విచక్షణ మరిచి.. పబ్లిక్ ప్లేస్ లలో రెచ్చిపోయారు.
ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న మెట్రో రైలులో తమ లవర్లను ముద్దులు పెట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. కోవిడ్ రూల్స్ ను బ్రేక్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 24న యెకటెరింగ్ బర్గ్ మెట్రోలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము నైట్ క్లబ్బులను సపోర్టు చేస్తున్నామని.. వాటికి లాక్డౌన్ నుంచి మినహాయింపునివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
అయితే ఇలాంటి వీడియోలను ఎప్పుడూ ప్రోత్సహించే నెటిజన్లు మాత్రం ఈసారి వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వాలు నిబంధనలు విధించేది వారి స్వార్థం కోసం కాదని.... జనాల బాగు కోరి చేస్తున్నారని అంటున్నారు. కరోనా రూపాంతరం చెంది మరింత బలంగా మారిన నేపథ్యంలో ఇలాంటి దుస్సాహసాలకు ఒడిగట్టద్దని హితువు పలుకుతున్నారు.
Published by:Srinivas Munigala
First published:December 30, 2020, 17:39 IST