ఉక్రెయిన్ పై రష్య భీకర దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనిలో పోలాండ్ దేశం, ఉక్రెయిన్ కు బాసటగా నిలిచింది. రష్యాను ఎదుర్కొవడానికి అన్ని విధాల సహయం చేస్తుంది. ప్రపంచ దేశాల మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా పుతిన్ (Vladimir putin), ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అక్కడి ప్రధాన నగరాలు తమ రూపు రేఖలను కొల్పోయాయి. విమానాలు, బాంబులతో రష్యన్ సైనికులు విరుచుకుపడుతున్నారు. దీంతో ఇప్పటికే లక్షలాది మంది ఉక్రెయిన్ (Ukraine war) ప్రజలు అక్కడి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. మరికొంత మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటు కాలం వెల్లదీస్తున్నారు. ఇక అక్కడ అనేక నగరాలలో శవాలు గుట్టలు గుట్టలుగా మారాయి. దీంతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది.
The Russian ambassador to Poland was attacked as he tried to lay a wreath at the Soviet soldiers' cemetery in Warsaw. pic.twitter.com/FFtBzuRITW
— RadioGenova (@RadioGenova) May 9, 2022
ప్రస్తుతం.. వీడియోలో రెండో ప్రపంచ యుద్ధం ముగింపును.. రష్యా విక్టరీడేగా (Victory day) జరుపు కుంటుంది. దీనిపై ఇప్పటికే సోవియట్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వేల మంది సోవియట్ సైనికులను పుతిన్ పొట్టన పెట్టుకున్నాడని వారు తీవ్ర నిరసనలు తెలిపారు. అయితే, పోలాండ్ లోని రష్య రాయబారి సెర్గీ ఆండ్రివ్ (Sergey Andreev) వార్సాలోని సైనికుల స్మశాన వాటికలో నివాళులు అర్పించడానికి వచ్చారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక దశలో, రాయబారి ముఖం మీద నిరసన కారులు ఎరుపు రంగు పెయింట్ ను వేసి (Russian Ambassador Attacked With Red Paint) తమ నిరసన తెలిపారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో గుమిగూడారు. భద్రత సిబ్బంది, సెర్గీ ఆండ్రివ్ ను అక్కడి నుంచి తప్పించి వేరే చోటకు తీసుకెళ్లారు.
ఇంకా రష్యా సైనికులు.. (Russia soliders) అక్కడి మహిళలు, యువతులపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. గతంలో అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. గతంతో ఒక ఇంట్లో ప్రవేశించిన రష్యన్ సైనికుడు తనకు .. లొంగకపోతే.. మరో 20 మందిని పిలిచి అత్యాచారం (Rape on Ukraine girls) చేయిస్తానని చెప్పాడని బాధిత యువతి వాపోయింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇక ఐక్యరాజ్యసమితి (Uno) అధికారులు కూడా అక్కడ పర్యటించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్ తన యుద్దోన్మోదాన్ని విడిచిపెట్టాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Poland, Russia, Russia-Ukraine War