పొట్టి బట్టల్లో ఆఫీసుకు వస్తే అతివలకు అదిరిపోయే ఆఫర్.. ఓ కంపెనీ పిచ్చి చర్య..

టాట్‌ప్రూఫ్ అనే కంపెనీ ‘ఫెమినినిటీ మారథాన్’ పేరిట గత నెల 27 నుంచి జూన్ 30 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మహిళలు పొట్టి స్కర్టులు వేసుకొని ఆఫీసుకు వస్తే బోనస్ ఇస్తామని ప్రకటించింది.

news18-telugu
Updated: June 1, 2019, 1:42 PM IST
పొట్టి బట్టల్లో ఆఫీసుకు వస్తే అతివలకు అదిరిపోయే ఆఫర్.. ఓ కంపెనీ పిచ్చి చర్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అందంగా మేకప్ వేసుకొని, పొట్టి పొట్టి స్కర్టులు ధరించి ఆఫీసుకు వస్తే.. బోనస్ ఇస్తాం అని ప్రకటించిందో రష్యా కంపెనీ. అలా రావడమే కాదు.. ఆ ఫోటోలను కంపెనీకి సంబంధించిన ఫోన్ నంబరుకు వాట్సాప్ చేయాలట. అలా చేస్తే రోజుకు రూ.105 అదనంగా ఇస్తామని ప్రకటించింది. టాట్‌ప్రూఫ్ అనే కంపెనీ ‘ఫెమినినిటీ మారథాన్’ పేరిట గత నెల 27 నుంచి జూన్ 30 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పనిచేసే చోట వెలుగులు నింపేందుకు ఈ రోజుల్లో మహిళలు స్కర్టులు ధరించి వస్తే, వాళ్లకు అదనపు జీతం ఇస్తాం అని పేర్కొంది. స్కర్టులు ఐదు అంగుళాలకు ఎక్కువ కాకుండా, మోకాళ్లు కనిపించేలా ఉండాలని షరతు విధించింది. దీనిపై ఆ కంపెనీ కమ్యూనికేషన్స్ శాఖ ప్రతినిధి అనస్టాసియా కిరిలోవా మాట్లాడుతూ.. ఈ చర్య వల్ల కంపెనీలో పనిచేసే మహిళలు తమ చార్మింగ్‌ను ఫీల్ అయ్యేలా చేస్తుందని, వారికి మరింత అవగాహన పెరుగుతుందని వ్యాఖ్యానించారు. అల్యూమినియం తయారు చేసే టాట్‌ప్రూఫ్.. 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్‌కి, 2018 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు అల్యూమియం సరఫరా చేసింది.

అయితే, ఈ ప్రకటనపై నెటిజన్లు సదరు కంపెనీపై విరుచుకుపడుతున్నారు. వెలుగుల పేరుతో చీకటి యుగంలోకి కొట్టుకుపోయేలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ మధ్యయుగం నాటి చర్యలని దుయ్యబట్టారు. పురుషులకు ఆనందం కలిగించేందుకు ఎందుకు స్కర్టులు వేసుకొని రావాలని ఓ మహిళ ప్రశ్నించింది.

First published: June 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు