హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Russia Ukraine War:  సీన్ రివర్స్.. తొలి సారి రష్యా భూభాగంలో ప్రవేశించిన ఉక్రెయిన్ దళాలు..హెలికాప్టర్ తో చమురు డిపోపై భీకర దాడులు..

Russia Ukraine War:  సీన్ రివర్స్.. తొలి సారి రష్యా భూభాగంలో ప్రవేశించిన ఉక్రెయిన్ దళాలు..హెలికాప్టర్ తో చమురు డిపోపై భీకర దాడులు..

ఉక్రెయిన్ దాడి చేసిన చమురు డిపోలు

ఉక్రెయిన్ దాడి చేసిన చమురు డిపోలు

Russia Ukraine Tragedy: ఉక్రెయిన్ పై రష్యా కొన్ని భీకర దాడులు కొనసాగిస్తుంది. ఉక్రెయిన్ తన రూపురేఖలను కోల్పోయింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో తాజాగా, ఉక్రెయిన్ దళాలు.. తొలిసారి రష్యా భూభాగంలో ప్రవేశించాయి. అంతటితో ఆగకుండా అక్కడి చమురు డిపోను నెలమట్టం చేశాయి.

ఇంకా చదవండి ...

Ukraines 1st airstrike hits Belgorod fuel depot: రష్యన్ సైన్యాలు.. ఉక్రెయిన్ పై గత కొన్ని వారాలుగా ముప్పెట దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్ దళాలు కూడా.. అంతే ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. బాంబులు, క్షిపణులు, రాకెట్ లతో రష్యన్ దళాలు.. ఉక్రెయిన్ (Ukraine) ను అల్లకల్లోలం చేస్తున్నాయి. కీవ్, ఖార్కీవ్, సుమీ, పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమైన, ఇప్పటికి పూర్తిగా స్వాధీనం చేసుకొలేకపోయాయి.

బాంబులు, రాకెట్లు, క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు శిథిలాలుగా, శవాల దిబ్బలుగా మారాయి. ప్రపంచ దేశాలు.. ఉక్రెయిన్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నాయి. ప్రపంచదేశాలు.. ప్రత్యక్షంగా యుద్దంలో దిగకపోయిన, పరోక్షంగా ఉక్రెయిన్ కు ఆయుధాలు, తదితర అవసరాలను తీరుస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్ స్కీ (Zelenskyy) పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొంటున్నారు.

తాజాగా, ఉక్రెయిన్ దళాలు రష్యాపై ఆధిపత్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ తొలిసారి.. రష్యా సరిహాద్దు లోకి ప్రవేశించి బెల్గోరోడ్ లోని చమురు డిపోలపై దాడికి పాల్పడింది. ఈ విషయాన్ని స్వయంగా బెల్గొరోడ్ గవర్నర్ వెల్లడించారు. వారి వాదనే నిజమైతే.. దీన్ని వారి తొలివిజయంగా భావించవచ్చని పలువురు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన రెండు Mi-24 హెలికాప్టర్లు.. బెల్గోరోడ్‌లోని ఇంధన డిపోపై దాడి చేశాయని రష్యా సైన్యం అంగీకరించింది.

చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ ఈ రెండు హెలికాప్టర్లు క్షిపణులను ప్రయోగించి ఈ ఇంధన ట్యాంక్‌ను పేల్చివేశాయని తెలిపింది. రష్యన్ సైన్యం ప్రకారం.. ఈ ఇంధన డిపోలో చమురును సైన్యం కోసం కాకుండా.. పౌరులకు సరఫరా చేయడం కోసం నిల్వచేశామని తెలిపారు. ఈ దాడిలో డిపోలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు గాయాలయ్యాయి.

ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. మాస్కో నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్గోరోడ్ ఉక్రెయిన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతం. అదే విధంగా, ఉక్రెయిన్ యొక్క రెండవ అతిపెద్ద నగరంమయిన ఖార్కివ్ కు బెల్గోరోడ్ సరిహద్దు నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి ప్రవేశించి రష్యా సైన్యం దాడులు చేసింది. గత 37 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరు దేశాలు ఒకరికొకరు తీవ్ర నష్టాన్ని తెచ్చుకున్నాయి.

ఉక్రెయిన్‌కు చెందిన 124 విమానాలు, 81 హెలికాప్టర్లు, 353 యుఎవిలను తమ సైన్యం ప్రత్యేక సైనిక ఆపరేషన్‌లో కాల్చివేసినట్లు రష్యా పేర్కొంది. అదే సమయంలో, ఉక్రెయిన్ 17 వేల మంది రష్యన్ సైనికులను చంపినట్లు తెలిపింది. అయితే రష్యా ఈ సంఖ్యను పూర్తిగా ఖండించింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు