హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Russia Ukraine War: ‘అమ్మా మనం.. మళ్లీ స్వర్గంలో కలుద్దాం’.. చనిపోయిన తల్లికి.. తొమ్మిదేళ్ల బాలిక లేఖ.. వైరల్ అవుతున్న హృదయవిదారక ఘటన..

Russia Ukraine War: ‘అమ్మా మనం.. మళ్లీ స్వర్గంలో కలుద్దాం’.. చనిపోయిన తల్లికి.. తొమ్మిదేళ్ల బాలిక లేఖ.. వైరల్ అవుతున్న హృదయవిదారక ఘటన..

వైరల్ అవుతున్న బాలిక లేఖ

వైరల్ అవుతున్న బాలిక లేఖ

Russia Ukraine crisis: ఉక్రెయిన్ పై రష్యా మారణ హోమాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రష్యన్ దాడులకు సంబంధించి అనేక హృదయ విదారక దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఒక పసిపాప.. చనిపోయిన తన తల్లికి రాసిన లేఖ నెటిజన్ల ను కంట తడి పెట్టిస్తుంది.

ఇంకా చదవండి ...

9 Year Old Girl Writes Letter To Mother: పుతిన్ తన అధికార దురాహాంకారంతో ఉక్రెయిన్ ను పూర్తిగా నాశనం చేస్తున్నారు. దీనిలో సామాన్య ప్రజలు , అమాయకులు సమిధలుగా మారుతున్నారు. నెల రోజులకు పైగా రష్యన్ సైన్యాలు ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ లోని ముఖ్య నగరాలన్ని బాంబులు, క్షిపణుల మోతకు వాటి రూపురేఖలను కొల్పోయాయి. పుతిన్ (Vladimir putin) దురహాంకారాన్నిప్రపంచ దేశాలు వ్యతిరేకించిన ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇప్పటికే పలు దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్ కు పరోక్షంగా సహాయం చేస్తున్నాయి. రష్యన్ భీకర దాడుల వలన కోట్లాది ప్రజలు తమ దేశం విడిచి పెట్టి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. అదే విధంగా కొన్ని చోట్ల యువతులు, మహిళలు తీవ్రమైన దాడులను ఎదుర్కొంటున్నారు.


ప్రస్తుతం తొమ్మిదేళ్ల బాలిక గాలియా రష్యా దాడిలో చనిపోయిన తన తల్లికి లేఖను రాసింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోరోడియంకాలో చనిపోయిన తన తల్లికి లేఖను రాస్తు.. అమ్మ నువ్వు ప్రపంచంలో గొప్ప తల్లివి. నేను నిన్ను ఎప్పటికి మరచిపోలేను. నువ్వు నాకు చెప్పినట్లు సమాజంలో మంచిపేరు సంపాదిస్తాను. మనం స్వర్గంలో కలుద్దామంటూ గాలియా లేఖను రాసింది. ప్రస్తుతం దీన్ని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సలహదారు అంటోన్ గెరాష్చెంకో ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీంతో ఇది వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కంటతడి పెడుతున్నారు.

గతంలో .. సాషా మకోవియ్ అనే తల్లి తన కూతురి వీపుపై తన తల్లిదండ్రుల వివరాలు, బంధువుల వివరాలు, ఫోన్ నంబర్ రాసింది. ఏదైన అనుకొనిది జరిగితే తన కుతూరును వారి బంధువుల వద్దకు చేరుస్తారని ఆమె భావించింది. ఈ ఫోటోను యూరప్ జర్నలిస్ట్ అనస్తాసియా లాపాటినా ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కీవ్, మరియూపోల్ వంటి పలు నగరాలు శవాల దిబ్బలుగా మారాయి. ఆస్పత్రులు, నివాస భవనాలు అన్నింటిని పుతిన్ సైన్యం నాశనం చేస్తుంది. దీనికి తోడు రష్యా సైనికులు దురాగతాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. ఎందరో మహిళలపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అమాయకులను పట్టుకుని బలవంతంగా అనుభవించు కుంటు పశువాంఛను తీర్చుకుంటున్నారు. మరికొందరిని ఊచకొత కొస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు