హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఉక్రెయిన్ కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. విదేశాంగ మంత్రి ట్వీట్.. అసలేం జరిగిందంటే..

ఉక్రెయిన్ కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. విదేశాంగ మంత్రి ట్వీట్.. అసలేం జరిగిందంటే..

రష్యా, ఉక్రెయిన్ పై వేసిన 500 కేజీల బాంబు

రష్యా, ఉక్రెయిన్ పై వేసిన 500 కేజీల బాంబు

Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా దాడుల పర్వం కొనసాగుతుంది. వరుసగా పన్నెండో రోజు కూడా పుతిన్ (Vladimir Putin)దళాలు బాంబులు, రాకెట్లు,క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. తాజాగా, ఉక్రెయిన్ లోని ఒక నివాస భవనంపై దాదాపు.. 500 కేజీల భారీ బాంబును రష్య వేసింది. దీంతో..

ఇంకా చదవండి ...

Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా దాడుల పర్వం కొనసాగుతుంది. వరుసగా పన్నెండో రోజు కూడా పుతిన్ (Vladimir Putin)దళాలు బాంబులు, రాకెట్లు,క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. తాజాగా, ఉక్రెయిన్ లోని ఒక నివాస భవనంపై దాదాపు.. 500 కేజీల భారీ బాంబును రష్య వేసింది. దీంతో..

రష్యాన్ దళాలు..మూకుమ్మడిగా (Russian Ukraine War) ఉక్రెయిన్ పై ధ్వంస రచనను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే రాకెట్ లు, భారీ బాంబులు, బలమైన క్షిపణులను ప్రయోగిస్తుంది. దీంతో ఉక్రెయిన్ , కీవ్ ,ఖార్కివ్, సుమీ పలు ప్రాంతాలలోని భవనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జనావాసాలు, ప్రభుత్వ కార్యలయాలు, ఆసుపత్రులు ఇలా.. ప్రతి దానిపై దాడులు జరుగుతున్నాయి.

ప్రపంచ దేశాలు, నాటో కూటమి చేసిన విన్నపాన్ని పుతిన్ పూర్తిగా తిరస్కంచారు. ఉక్రెయిన్ ను పూర్తిగా హస్తగతం చేసుకునే విధంగా పావులు కదుపుతున్నారు. ఈ విధ్వంస కాండలో ఇరు దేశాలలోను భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.పలు దేశాలు, ఇప్పటికే రష్యాపై (Russia) తీవ్రమైన ఆంక్షలు విధించాయి.అయినా.. పుతిన్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

ఇతర దేశాలు యుద్ధంలో జోక్యం చేసుకుంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ప్రపంచ దేశాలు.. పుతిన్ చర్యలను వ్యతిరేకిస్తున్న.. ప్రత్యక్షంగా యుద్ధంలో మాత్రం దిగడం లేదు. ఇక పరోక్షంగా ఉక్రెయిన్ (Ukraine) కు మద్దతును అందిస్తున్నాయి.

గత పన్నెండు రోజులుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ , సుమీ,ఖార్కీవ్ పలు పట్టణాలు బాంబు దాడులకు నాశనం అయ్యాయి. తమ రూపు రేఖలను కొల్పోయాయి. ఇక తాజాగా.. రష్యా చెర్హినివ్ నగరంలో తన బాంబుదాడులు చేస్తుంది.

ఈ రోజు 500 కేజీల బరువైన బాంబును ప్రయోగించింది. కానీ అదృష్టవశాత్తు అది పేలలేదు.అయితే, అది పేలలేదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిట్రో కులేబా ట్వీట్ చేశారు. దీంతో రష్యా ఏ మేరకు బీభత్సం సృష్టిస్తుందో తెలుసుకొవచ్చు .

ఉక్రెయిన్ లోని అనేక ప్రదేశాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు.. 15 లకల మంది వరకు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. ఈ మారణ హోమంలో..ఎంతో మంది అమాయక ప్రజలు చంపబడ్డారు. కొంత మంది ఉక్రెయిన్ ప్రజలు స్వచ్చందంగా యుద్దంలో పాల్గొంటున్నారు.

అందుకే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెంస్కీ(Zelenskyy) .. తమ దేశంపై నుంచి నో ఫ్లైట్ జోన్ విధించాలని పదే పదే యూరప్ దేశాలను కొరుతున్నారు.దీంతో నష్టాన్ని కొంత వరకైన నిలువరించవచ్చని భావిస్తున్నారు.

ఇటు నోఫ్లైట్ జోన్ విధిస్తే.. యూరప్ దేశాలు తమతో ప్రత్యక్షంగా యుద్దంతో పాల్గొన్నట్లే భావిస్తామని.. ఇక జరిగే నష్టానికి వారే బాధ్యులని పుతిన్.. ఆయా దేశాలను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రపంచ దేశాలు ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి.

First published:

Tags: America, Russia, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు