హోమ్ /వార్తలు /trending /

కొరకరాని కొయ్యలా మారిన ఉక్రెయిన్.. పుతిన్ చేసిన చారిత్రక తప్పులు ఏంటంటే..

కొరకరాని కొయ్యలా మారిన ఉక్రెయిన్.. పుతిన్ చేసిన చారిత్రక తప్పులు ఏంటంటే..

Russia Ukraine Crisis: రష్యన్ సైన్యాలు.. ఉక్రెయిన్ పై గత రెండు వారాలుగా ముప్పెట దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్ దళాలు కూడా.. అంతే ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. ఇప్పటికి పుతిన్ సైన్యం, ఉక్రెయిన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోలేక పోయింది. ఇప్పుడు ఇది పుతిన్ (Vladimir Putin) కు తలనొప్పిగా మారింది.

ఇంకా చదవండి ...

    గత రెండు వారాలుగా బాంబులు, క్షిపణులు, రాకెట్ లతో రష్యన్ దళాలు.. ఉక్రెయిన్ (Ukraine) ను అల్లకల్లోలం చేస్తున్నాయి. కీవ్, ఖార్కీవ్, సుమీ, పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమైన, ఇప్పటికి పూర్తిగా స్వాధీనం చేసుకొలేకపోయాయి.

    ఉక్రెయిన్ తో పోలిస్తే రష్యా అత్యంత సైనిక సంపత్తి, ఆయుధ సామాగ్రి కలిగిన దేశం. అత్యంత వినాశనాన్నికల్గించే అణుబాంబులను కల్గి ఉంది. అయినా కూడా ఇప్పటికి జెలెన్ స్కీ సైన్యం గట్టిగానే ప్రతిఘటిస్తున్నారు.

    అయితే, ప్రపంచ దేశాలు.. ఉక్రెయిన్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నాయి. ప్రపంచదేశాలు.. ప్రత్యక్షంగా యుద్దంలో దిగకపోయిన, పరోక్షంగా ఉక్రెయిన్ కు ఆయుధాలు, తదితర అవసరాలను తీరుస్తున్నాయి.

    జెలెన్ స్కీ (Zelenskyy) తాను.. స్వతహగా యుద్ధ రంగంలోనికి దిగి.. యుద్ధంలో పాల్గొంనాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రజల్లో స్పూర్తిని నింపారు. మొదటి నుంచి జెలెన్ స్కీ వ్యూహత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. ఇటు ప్రపంచ దేశాల మద్దతును కోరే ప్రయత్నం చేశారు. ఇటు స్వతహగా సైన్యాన్ని శక్తివంతం చేసుకున్నారు. మళ్లి రష్యాను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. అనేక ఆంక్షలు ఎదుర్కొనేలా చేశారు.

    గతంలో రష్యా (Russia) 2014లో ఉక్రెయిన్ లోని క్రిమియా ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎనిమిది సంవత్సరాలలో.. ఉక్రెయిన్ తన సైన్యంను ప్రత్యేక శికణను ఇచ్చింది. ఆయుధ సంపత్తిని కూడా పెంచుకుంది.

    ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి.. తనను తాను యుద్ధానికి సన్నద్ధం చేసుకుంది. అమెరికాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణను ఇచ్చింది. వీరంతా... ఇతర సైనికులకు శిక్షణ ఇచ్చారు. దీంతో యుద్ద పరిస్థితులు, అనుకూలంగా మారాయి. యూరప్ దేశాల్లో ఉక్రెయిన్ కూడా పెద్ద సైన్యాన్నికలిగి ఉంది.

    దాదాపు.. 1,70 వేల సైనికులు ఉన్నారు. మరో 1 లక్ష మంది సైనికులు రిజర్వులో (Special Force) ఉంచారు.వీరే కాకుండా వేరే సైన్యాన్ని కూడా సిద్ధం చేశారు. వీరిలో రిటైర్ అయిన సైనిక అధికారులు కూడా ఉన్నారు.

    వీరితో పాటు ప్రస్తుతం ప్రజలుకూడా స్వచ్చందంగా యుద్ధంలో పాల్గొంటున్నారు. దీంతో ఉక్రెయిన్ కొరకరాని కొయ్యలా మారింది. అయితే, తొలుత అమెరికా, నాటో దళాల సహయం కోసం వేచి చూసిన ఉక్రెయిన్ ఆ తర్వాత.. తానే యుద్ధంలో మెళకువలు ప్రదర్శిస్తోంది.

    అందుకే అత్యంత సైనిక దళాలు ఉన్న రష్యా.. ఇప్పటికి ఉక్రెయిన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకొలేక పోయింది. అంతేకాకుండా స్థానిక ప్రజలు నిరంతరం రష్యన్ ల సమచారాన్ని, ఉక్రెయిన్ దళాలకు చేరవేస్తున్నాయి. రష్యన్ ట్యాంకులపై దాడులకు పాల్పడుతున్నారు. చాలా మంది తమ కుటుంబాలను వేరే దేశాలకు పంపించివేసి.. మాత్రు భూమికోసం పోరాడుతున్నారు.

    చాలా చోట్ల ఉక్రెయిన్ ప్రజలు.. రష్యన్ ఆయుధాలను స్వాధీనంచేసుకుని వారితోనే యుద్దానికి దిగుతున్నారు. అయితే, ఫిబ్రవరి 24న యుద్ధం ప్రకటించిన రష్యా.. తక్కువ సైనికదాడిలో విఫలం చెందినట్లు తెలుస్తోంది. అదే విధంగా, సైనిక, వైమానిక దళాలు కలిసి పనిచేయడంలో వైఫల్యం చెందినట్లు నిపుణులు భావిస్తున్నారు.

    అదే విధంగా యుద్దాన్ని అంచనా వేయడంలో, వ్యూహలు పన్నడంలో పుతిన్ (Vladimir Putin) కాస్త పొరబడ్డారని తెలుస్తోంది. వెరసి రెండు వారాలు గడుస్తున్న ఇప్పటికి ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకొలేని పరిస్థితి నెలకొందని సైనిక నిపుణులు భావిస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు