Russia Ukraine Crisis: రష్యన్ సైన్యాలు.. ఉక్రెయిన్ పై గత కొన్ని వారాలుగా ముప్పెట దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్ దళాలు కూడా.. అంతే ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. బాంబులు, క్షిపణులు, రాకెట్ లతో రష్యన్ దళాలు.. ఉక్రెయిన్ (Ukraine) ను అల్లకల్లోలం చేస్తున్నాయి. కీవ్, ఖార్కీవ్, సుమీ, పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమైన, ఇప్పటికి పూర్తిగా స్వాధీనం చేసుకొలేకపోయాయి.
ప్రపంచ దేశాలు.. ఉక్రెయిన్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నాయి. ప్రపంచదేశాలు.. ప్రత్యక్షంగా యుద్దంలో దిగకపోయిన, పరోక్షంగా ఉక్రెయిన్ కు ఆయుధాలు, తదితర అవసరాలను తీరుస్తున్నాయి. ఇప్పటికే యుద్ధ బీభత్సానికి సంబంధించి పలు విధ్వంసకర వీడియోలు వైరల్ గా మారాయి. పెద్ద బాంబులు, ఎత్తైన భవనాలపై , ఆసుపత్రులపై బాంబులు, క్షిపణుల దాడులకు సంబంధించి అనేక వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా, ఒక వీడియోలో కీవ్ (Kyiv )నగరం గుండా ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. అప్పుడు అతనికి కొద్ది దూరంలోనే ఒక మిసైల్ దాడి (Russian missile strike) జరిగింది . పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. అతనికి కొద్ది దూరంలోనే పేలుడు సంభవించింది. వెంట్రుక వాసి దూరంలో తన ప్రాణాలను నిలుపుకున్నాడు. ఈ వీడియో అక్కడి సీసీ కెమారాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
View this post on Instagram
జెలెన్ స్కీ (Zelenskyy) తాను.. స్వతహగా యుద్ధ రంగంలోనికి దిగి.. యుద్ధంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రజల్లో స్పూర్తిని నింపారు. మొదటి నుంచి జెలెన్ స్కీ వ్యూహత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. ఇటు ప్రపంచ దేశాల మద్దతును కోరే ప్రయత్నం చేశారు. ఇటు స్వతహగా సైన్యాన్ని శక్తివంతం చేసుకున్నారు.
తొలుత రష్యన్ సైన్యం.. జనావాసాలు, సామాన్య ప్రజలపై దాడులు చేయబోమని తెలిపింది. ఆ తర్వాత.. తన మాటను మార్చింది. ప్రస్తుతం యుద్దంలో భాగంగా.. ఆసుపత్రులపై కూడా దాడులు చేస్తున్నారు. ఉక్రెయిన్ (Ukraine) ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యన్ బలగాలు ముందుకు సాగుతున్నాయి. దీంతో ఉక్రెయిన్ , కీవ్ ,ఖార్కివ్, సుమీ పలు ప్రాంతాలలోని భవనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. జనావాసాలు, ప్రభుత్వ కార్యలయాలు, ఆసుపత్రులు ఇలా.. ప్రతి దానిపై దాడులు జరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Missile, Russia, Russia-Ukraine War