Home /News /trending /

RUSH FOR COCONUT PRASAD CAUSES STAMPEDE IN MADHYA PRADESH 17 INJURED PAH

OMG: కొంప ముంచిన అత్యుత్సాహం... 17 మందికి తీవ్ర గాయాలు.. అసలేం జరిగిందంటే..

వేదిక దగ్గర తోపులాట

వేదిక దగ్గర తోపులాట

Madhya Pradesh: అప్పటి వరకు కార్యక్రమం సజావుగా సాగింది. ఈ క్రమంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో తోపులాట ప్రారంభమైంది.

సాధారణంగా మత పరమైన సమావేశాలు, రాజకీయ సమావేశాల్లో జనాలు గుంపులు గుంపులుగా హజరవుతారు. నిర్వాహకులు, అధికారులు సరైన సదుపాయాలు అరెంజ్ చేస్తారు. కానీ ఒక్కొసారి వారు ఊహించిన దాని కంటే కూడా ప్రజలు ఎక్కువగా వస్తే.. తొక్కిసలాట జరుగుతుంటుంది. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి తొపులాటకు కారణమవుతారు. దీంతో వెనుక ఉన్న వారు ఏదో గందల గోళానికి గురై.. ఒకరిపై మరోకరు పడిపోతారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో జరిగింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh) సాగర్ జిల్లాలో ఒక కార్య క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. బినా పట్టణంలో జరిగిన ఒక మత పరమైన కార్యక్రమంలో దాదాపు.. 25000 వేల మంది భక్తులు హజరయ్యారు. కొంత సేపు కార్యక్రమం సజావుగానే సాగింది. కానీ కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి, తమ వారిని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు.

బారికెడ్లను దాటుకుంటూ వచ్చారు. దీంతో తోపులాట ప్రారంభమైంది. ఒకరిని చూసి మరికొందరు ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. చూస్తుండగానే కొందరు కింద కూర్చున్న వారిపై పడ్డారు. మహిళలు,వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు స్టేజీ దగ్గరకు వచ్చి ప్రసాదం (Rush For Coconut Prasad)  తీసుకొవడానికి ప్రయత్నించారు. దీంతో ఒకర్నిమరోకరు ముందుకు నెట్టుకుంటూ వచ్చారు. తమకు ఎక్కడ దొరకదో అని.. తోపులాట ప్రారంభించారు. దీంతో నిర్వాహకులకు భక్తులను కంట్రోల్ చేయలేకపోయారు.

ఎండ కూడా తీవ్రంగా ఉండటంతో చాలా మంది అదే ప్రదేశంలో కుప్పకూలీపోయారు. దీంతో ఆ ప్రదేశమంతా అరుపులు, కేకలతో గందరగోళంగా (Stampede) మారింది. దాదాపు 17 మంది భక్తులు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు చేరుకుని రద్దీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. గాయపడిన వారిని అంబూలెన్స్ లలో సమీపంలోని ఆస్పత్రులలో తరలించారు. నిర్వాహకులు సరైన సదుపాయాలు కల్పించలేదని, రద్దీని ముందుగా ఊహించలేక పోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Injured, Madhya pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు