తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు షురూ... రేపు కీలక ప్రకటన?

ఏపీ ప్రభుత్వం కర్ణాటకతో అంతర్రాష్ట్ర బస్సుల రవాణా ప్రారభించింది... ఇక తెలంగాణతోనూ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.

news18-telugu
Updated: June 23, 2020, 12:29 PM IST
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు షురూ... రేపు కీలక ప్రకటన?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో బుధవారం ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం కాబోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్యా అంతర్రాష్ట్ర బస్సు రవాణాను తిరిగి ప్రారంభించే అంశంబపై వీరు చర్చించబోతున్నారు. బుధవారం జరిగే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత వారం విజయవాడలో సమావేశమైన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులూ ఈ దిశగా చర్చలు జరిపారు. మరోసారి చర్చించుకొని ఫైనల్ చేసుకోవాలని అప్పుడే అనుకున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు నాలుగు దశల్లో బస్సు సర్వీసుల ఆపరేషన్స్ ప్రారంభించాలని గత వారం సమావేశంలో నిర్ణయించారు. అది ఎలా ప్రారంభించాలనే అంశంపై రేపు చర్చించబోతున్నట్లు తెలిసింది.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం... కర్ణాటకతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్ని ఈమధ్యే ప్రారంభించింది. ఈ క్రమంలో పెద్దగా సమస్యలేవీ రాలేదని తెలుస్తోంది. అందువల్ల తెలంగాణతో కూడా బస్సు సర్వీసులు ప్రారంభించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.

ఈ బస్సు సర్వీసుల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఇప్పటికే తెలంగాణలో జిల్లాల్లో బస్సులు తిరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో... సిటీలో బస్సులను, మెట్రో రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఐతే... రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపినా సమస్యేమీ ఉండదనే అభిప్రాయం ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి వస్తుండటంతో... సర్కారు ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

బుధవారం నాటి మీటింగ్‌లో బస్సుల్లో ఛార్జీలు ఎంత ఉండాలి, సీట్ల మధ్య గ్యాప్, సోషల్ డిస్టాన్స్, రాకపోకల సమయాలు, బస్సుల్ని ఎక్కడిదాకా నడపాలి... ఇలాంటి అన్ని అంశాలపై ఫైనల్‌గా నిర్ణయాలు తీసుకొని... ఏ తేదీ నుంచి బస్సులు నడపాలో ఖరారు చేస్తారని తెలుస్తోంది. సోమవారం లేదా శనివారం నుంచే బస్సుల్ని నడిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఏపీ కర్ణాటక మధ్య కంటే... ఏపీ, తెలంగాణ మధ్య బస్సుల్లో ప్రయాణించేవారు ఎక్కువ. ఎందుకంటే... ఏపీకి చెందిన చాలా మంది హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే... ఏపీకి చెందిన లక్షల మంది విద్యార్థులు హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఎంతో మంది హైదరాబాదీల చుట్టాలు, సొంతవారు ఏపీలో ఉన్నారు. వారంతా... నాలుగు నెలలుగా ఏపీకి వెళ్లకుండా ఉన్నారు. ఇప్పుడు బస్సు సర్వీసులు ప్రారంభిస్తే... అందరూ సొంత ఊళ్లకు వెళ్లి, తమ వారిని కలుసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల బస్సులు ఎప్పుడు ప్రారంభిస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు.
First published: June 23, 2020, 12:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading