RRR PROMOTION IN PUNJAB NTR RAMCHARAN RAJAMOULI PUJAS AT GOLDEN TEMPLE SNR
పంజాబ్‌లో ట్రిపులార్ ప్రమోషన్..గోల్డెన్ టెంపుల్లో స్టార్స్ పూజలు
(Photo Credit: Instagram)
RRR PUNJAB:పంజాబ్‌లో ట్రిపులార్ స్టార్స్ సందడి చేస్తున్నారు. మూవీ ప్రమోషన్‌కి వెళ్లిన ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి గోల్డెన్ టెంపుల్లో పూజలు చేశారు. ట్రిపులార్ లోగో ఉన్న సిక్కు మత సంప్రదాయ దుస్తుల్లో ఆలయంలోకి వెళ్లిన స్టార్స్ ప్రత్యేక పూజలు చేసి బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
రిలీజ్‌కి రెడీ అయిన ట్రిపులార్ (RRR)సినిమాపై క్రేజ్ ఏం రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదే రేంజ్లో ప్రమోషన్(Promotion) కూడా జరుగుతోంది. రామ్‌చరణ్(Ramcharan), ఎన్టీఆర్(NTR)లాంటి ఇద్దరు బిగ్ స్టార్స్‌తో డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)తీసిన భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే ఈ ట్రిపులార్ ప్రచార బాధ్యతల్ని తమ భుజాలపై వేసుకున్నారు ముగ్గురు మొనగాళ్లు.అందులో భాగంగానే రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పంజాబ్‌లో సందడి చేస్తున్నారు. ప్రమోషన్ కోసం వెళ్లిన రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముందుగా అమృత్సర్(Amritsar)లోని స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో గోల్డ్ టెంపుల్(Golden Temple)కి వెళ్లిన స్టార్స్ సిక్కు మత సంప్రదాయాల ప్రకారం ఎన్టీఆర్, చెర్రీ, రాజమౌళి పూజల్లో పాల్గొన్నారు. టాలీవుడ్ స్టార్స్ గోల్డెన్ టెంపుల్లో పూజలు చేసి బయటకు వస్తున్న వీడియోలను అక్కడి అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
గోల్డెన్ టెంపుల్లో బిగ్ స్టార్స్..
మరో నాలుగు రోజుల్లో రిలీజవబోతున్న సినిమా సౌత్ ఇండియా, ప్యాన్ ఇండియానే కాకుండా ఇంటర్నేషనల్ మూవీగా ఆడియన్స్‌లో ఓ బజ్ క్రియేట్ అయింది. అందుకే సినిమాని కేవలం ఆరు రోజుల్లో ప్రమోషన్ని పూర్తి చేయాలని దర్శక, హీరోలు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే సోమవారం పంజాబ్‌లో చేస్తుండగా..ఆదివారం గుజరాత్లో అంతకు ముందు కర్నాటకలో ముందుగా దుబాయ్‌లో మూవీ ప్రమోషన్ని డిఫరెంట్‌గా చేస్తూ వస్తున్నారు.
సిక్కు సంప్రదాయ పూజలు..
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన ట్రిపులార్ కావడం..ఇందులో బాలీవుడ్ స్టార్స్ సైతం యాక్ట్ చేయడంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ట్రిపులార్ ఈ నెల 25న విడుదలవుతుంది. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు.
వెరైటీ ప్రమోషన్..
మూడు గంటల నిడివి కలిగిన ట్రిపులార్ మూవీ కోసం డైరెక్టర్ రాజమౌళి, చిత్ర యూనిట్ దాదాపు రెండున్నర సంవత్సరాలకుపైగా సినిమా కోసం కష్టపడ్డారు. అందుకే సక్సెస్ కూడా అదే రేంజ్లో ఉండాలన్న కాన్సెప్ట్‌తోనే భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.